రాహుల్ గాంధీ చెప్పేదొకటి.. చేసేదొకటి ! : కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రొత్సహిస్తూనే.. మరోవైపు, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేక పోరాటం చేస్తామంటూ చెబుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూనే దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని, ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను స్వయంచాలకంగా అనర్హులుగా ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరిస్తామని పెద్ద ఎత్తున ప్రసంగించారు.
అదే రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాలను ఉల్లంఘించారు. ఇది రాజ్యాంగ రక్షణా లేక అపహాస్యమా ? మేము ఈ విషయాన్ని భారత సుప్రీంకోర్టుకు తీసుకువెళతాము అని కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
Rahul Gandhi holds the constitution in one hand, talks big that they will amend schedule 10 of constitution to facilitate defected Public representatives’ automatically disqualification
— KTR (@KTRBRS) June 24, 2024
Same @RahulGandhi promotes defection of 5 BRS MLAs against the anti-defection provisions of… pic.twitter.com/Wjh0WEk4xS
పోచారంను రాహుల్ గాంధీకి పరిచయం చేసిన రేవంత్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారంనాడు పోచారం కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.
ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జూన్ 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ ఉంది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకొని... దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్‌తో పాటు ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications