బీజేపీ, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలి; బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ కేటీఆర్ షాక్!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మరోమారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతితో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని తాను నమ్ముతున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనేది ఆ పార్టీ ఇష్టమని పేర్కొన్న మంత్రి కేటీఆర్, ప్రజలు మతం ప్రాతిపదికన ఓట్లు వేస్తారని తాను నమ్మనన్నారు.

తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సాధించిన సమగ్ర, సమతుల, సమ్మిళిత ప్రగతిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలనా సంస్కరణలు వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 9 ఏళ్లుగా పనీపాటా లేని ప్రతిపక్షాలకు ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని, విపక్షాలు హేతుబద్ధంగా, రుజువులతో మాట్లాడలేకపోతున్నాయి అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరని విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ కన్నా మంచి మోడల్ ఎక్కడుందో ధైర్యముంటే చూపించాలని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బిజెపిలకు సవాల్ విసిరారు. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీజేపీ చెయ్యని పనిని 9 ఏళ్ళలో చేసి చూపిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బిజెపి పరిపాలన కొత్త సీసాలో పాత సారా లా ఉంటుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇక ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన మంత్రి కేటీఆర్ బాంబు పేల్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై మాట్లాడిన మంత్రి కేటీఆర్ వారి టిక్కెట్లపై ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. పనితీరు బాగున్న వారికి మళ్లీ టికెట్ దక్కుతుందని, పనితీరులో వెనుకబడిన ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేనేలేదని ఆ పార్టీ సోషల్ మీడియా లో మాత్రమే హంగామా చేస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాతో పోటీపడే పరిస్థితిలో లేదని అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలు కంటే అది వారి ఇష్టం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో వైఎస్ షర్మిల, కె.ఏ.పాల్ కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎవరేం చేసినా సరే ఈసారి అధికారం మళ్లీ బిఆర్ఎస్ దే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications