ఏపీకి వచ్చే పరిశ్రమను తన్నుకుపోయిన కేటీఆర్, ఇక బాబు అప్రమత్తం?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే ఓ పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణకు తన్నుకుపోయారనే వార్తలు వస్తున్నాయి. మైక్రోమాక్స్‌ను తమ రాష్ట్రంలో కర్మాగారం ఏర్పాటు చేయించేందుకు ఏపీ ఒప్పించిందని సమాచారం.

అయితే, రంగంలోకి దిగిన కేటీఆర్ మైక్రోమాక్స్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి తెలంగాణకు వచ్చేందుకు పావులు కదిపారట. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇఖ పైన పారిశ్రామికవేత్తలతో జరిపే చర్చలను గోప్యంగా ఉంచాలని భావిస్తోందని చెబుతున్నారు.

KTR Effect: Micromax to open manufacturing units in Telangana

కేసులతో కేసీఆర్ బిజీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ తదితరాలతో బిజీగా ఉన్నారు. నిత్యం పోలీసు అధికారులతో భేటీ అవుతున్నారు. తరుచూ గవర్నర్ నరసింహన్‌తోను భేటీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికాంశాల్లో వార్షిక రుణ ప్రణాళిక విడుదల కార్యక్రమానికి ఆయన గైర్హాజరు అయ్యారు. మంగళవారం నాడు తెలంగాణ వార్షిక రుణ ప్రణాళిక విడుదల కార్యక్రమం జరిగింది. దీనిలో కేసీఆర్ పాల్గొనలేదు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం హాజరయ్యారు. కీలక సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+