కేటీఆర్ కేసుపై హైకోర్టులో కీలక పరిణామం - ఈడీ ఎంట్రీతో..!!
కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఏసీబీ కేసు పై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు కోరుతున్నారు. కేటీఆర్ పిటీషన్ పైన హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. ఇటు ఈడీ సైతం కేటీఆర్ కేసులో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నగదు బదిలీ .. లావా దేవీల పైన వివరాలు కోరినట్లు సమాచారం. అటు ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలు పెట్టింది. దీంతో, ఈ రోజు కోర్టులో జరిగే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాిగుతోంది.
కోర్టులో పిటీషన్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహా రంలో ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ మేరకు కేటీఆర్ తరఫు లాయర్లు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, తిరస్కరించారు. దీంతో, సీజే బెంచ్ ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు. లంచ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈడీ ఆరా
ఇదే కేసులో ఈడీ సైతం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసు కోసం జరిగిన నగదు లావా దేవీల పైన ఆరా తీసినట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా నగదు బదిలీ చేసారనే ఆరోపణల పైన వివరణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేసారని చెబుతున్నారు. అయితే, నిబంధనలు పాటించకుండా నగదు ఎలా బదిలీ అయిందనే కోణం లో ఈడీ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు రాజకీయంగానూ ఈ కేసు సున్నితంగా మారింది. కేటీఆర్ అరెస్ట్ తప్పదనే అభిప్రాయం రాజకీయంగా వినిపిస్తోంది. ఏం జరిగినా శాంతి యుతంగానే వ్యవహరించాలని ఇప్పటికే కేటీఆర్ సూచించారు.
అవినీతి జరగలేదు
ఇటు కేటీఆర్ మరోసారి తన కేసు గురించి స్పందించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అర పైసా కూడా అవినీతి లేదన్నారు. అయినా కేసు పెట్టి ముందుకే వెళితే లీగల్‌గా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌కు టీవోటీ విధానంలో టెండర్లు పిలిచామని.. దానికి అత్యుత్తమ బిడ్లు వచ్చాయన్నారు. దాని నుంచి వచ్చిన రూ.7400 కోట్లను రైతు రుణమాఫీకి వాడామన్నారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో టెండర్లు పిలిచింది వాస్తవమన్నారు. కుంభకోణం అయితే టెండర్ ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీసారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేపు (శనివారం) కూడా అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, కోర్టులో చోటు చేసుకునే పరిణామాలతో కేటీఆర్ అరెస్ట్ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications