సీఎం రేవంత్‌కు వాటిమీదే శ్రద్ధ: కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో లేదని విమర్శించారు. హైదరాబాద్ నగర శివారులోని గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయినా ప్రారంభించకపోవడాన్ని ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రస్తావించారు.
పనికిమాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గేలా, ఉపశమనం కల్గించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను చేపట్టి పూర్తి చేసిందని కేటీఆర్ తెలిపారు. పూర్తయిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కోసం వేచి చూస్తోందన్నారు. ఫ్లైఓవర్‌ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు సీఎం రెడ్డి సమయం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీ బాస్‌ల చుట్టూ చక్కర్లు కొట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడంలో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
This is what happens when we have an inept government and clueless leadership!
— KTR (@KTRBRS) July 12, 2024
The Gopanpally flyover, initiated by the BRS Government to bring relief to residents around Nallagandla, Gopanpally, Tellapur, and Chandanagar, was completed a few months ago. But even today, it is… pic.twitter.com/AoFDSAArC0
ప్రజల కోసం గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను కేటీఆర్ కోరారు. లేదంటే ప్రజలే ఆ ఫ్లైఓవర్‌ను ప్రారంభించే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైద్యారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో సర్కారు వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని అన్నారు. కానీ, కాంగ్రెస్ గద్దెనెక్కిన ఆరునెలల్లోనే సర్కారు దవాఖానాల్లో కనీసం మందు గోళీలు దొరకని దుస్థితి వచ్చిందని విమర్శించారు. ఇలా దిగజార్చింది రేవంత్ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలైపోయాయన్నారు.












Click it and Unblock the Notifications