Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఊరుకుంటారా?: సినిమా మిగిలే వుందంటూ కేటీఆర్

కాంగ్రెస్​ పార్టీ నిజ స్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలని బీఆర్​ఎస్​ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)​ దిశానిర్దేశం చేశారు. ప్రజలను వంచించాలని అనుకుంటున్న కాంగ్రెస్​ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్​‌లో జరుగుతున్న వరంగల్​ లోక్‌​సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్​ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

విధ్వంసమైన తెలంగాణను పదేళ్లలో కేసీఆర్​ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్(KCR)​ కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని కేటీఆర్​ చెప్పుకొచ్చారు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని తెలిపారు. పరిపాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

KTR fires at congress govt in Warangal Lok Sabha Preparatory Meeting

పార్టీ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళతామన్నారు కేటీఆర్. ఉద్యమాల వీరగడ్డ వరంగల్​ జిల్లాలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే బీఆర్​ఎస్​ నేతలు ఓడిపోయారన్నారు. జయశంకర్​ సార్​ పుట్టిన నేలలో 2014, 2019లో వరంగల్​ ఎంపీ సీటును బీఆర్​ఎస్​ గెలుచుకుందన్నారు. ఈసారి కూడా వరంగల్​లో గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్​ కోరారు.

సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయని తెలిపారు కేటీఆర్. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి.. పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దామని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉందని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని కేటీఆర్​ చెప్పారు.

ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం గుర్తుంచుకోని ముందుకు పోదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని 420 హామీలు ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలని కేటీఆర్​ సూచించారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నామని, కానీ గవర్నర్​ ప్రసంగం, శ్వేత పత్రాలతో బీఆర్​ఎస్​, కేసీఆర్​ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మొదలు పెట్టారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు బీఆర్​ఎస్​పై నిందలు వేస్తున్నారన్నారు. అనవసరంగా నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

KTR fires at congress govt in Warangal Lok Sabha Preparatory Meeting

కాంగ్రెస్​ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటి పైన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా అబద్ధమాడారన్నారు. జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్​ ధ్వజమెత్తారు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అంటూ నిలదీశారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్​ పాలనపై వ్యతిరేకత మొదలైందన్న కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్​ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కేటీఆర్ తోపాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+