కాంగ్రెస్ 420 హామీలిచ్చి..: లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోరు తప్పదన్న కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంటులో గులాబీ జెండా ప్రాతినిథ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా భారత్ రాష్ట్ర సమితి మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం సాధించగలమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌కు గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి, ఇప్పటికే పలు హామీలపై మాట దాటేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పించుకునే ప్రయత్నం చేశారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే.. ఆయా లబ్ధిదారులతో కలిసి తమ పార్టీ పోరాటం చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే.. బీఆర్ఎస్ తరపున కొట్లాడుదామన్నారు కేటీఆర్.
రైతుబంధు డబ్బులు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి ఆ పార్టీ తీసుకొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అస్తవస్త్య పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కేటీఆర్ సూచించారు.

పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పులు, చేర్పులు అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా మార్చుకుంటామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గతంలో అయినా, భవిష్యత్ లోనైనాకొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జనరల్ సెక్రెటరీ కే.కేశవరావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్, మధుసూధనా చారి, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications