హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో థర్మో ఫిషర్ ఇండియా సెంటర్ ప్రారంభం: గూగుల్‌తో సర్కారు కొత్త ఒప్పందం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ స్థాయి సంస్థల పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్‌ ఇండియా ఇంజినీరింగ్‌ ఆర్ అండ్ డీ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌లో థర్మో ఫిషర్స్‌ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ప్రతి సంవతసరం 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటైందని తెలిపారు. థర్మో షిషర్స్ ఇండియా సంస్థ పరిశోధన కోసం ప్రతి ఏటా 1.4 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధిస్తోందని వెల్లడించారు.

ktr inaugurates thermo fisher india center in Hyderabad: new MOU with Google.

2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుతో 450 మందికిపైగా ఇంజినీర్లకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు కేటీఆర్. గత నెలలో బోస్టన్‌లో థర్మో ఫిషర్స్‌ ప్రతినిధులను కలిశానని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని.. నైపుణ్యం, సామర్థ్యం విషయంలోనూ హైదరాబాద్‌ నగరానిది ప్రత్యేక స్థానమని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఐడీపీఎల్‌, ఇక్రిశాట్‌, సీఎస్‌ఐఆర్‌ వంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి వాతావరణం కల్పిస్తున్నామని.. పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య గురువారం మరో అవగాహన ఒప్పందం కురిదింది. పౌర సేవలు, విద్య, ఇతర రంగాల్లో ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక సహకారం అందించనుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు కేటీఆర్. తాజా ఒప్పందంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

'మౌంటైన్ వ్యూ, యూఎస్ఏ వద్ద ఉన్న హెచ్‌క్యూ తర్వాత ఆ దేశం వెలుపల గూగుల్ అతిపెద్ద క్యాంపస్‌ను రూపొందించడానికి చాలా సంతోషిస్తున్నాము. సుస్థిరతతో నిర్మించిన 3.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ల శక్తి సామర్థ్యం గల క్యాంపస్ రాబోయే దశాబ్దాలపాటు హైదరాబాద్‌కు మైలురాయిగా నిలుస్తుంది. నిరంతర మద్దతుకు గూగుల్‌కు ధన్యవాదాలు' అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

English summary
ktr inaugurates thermo fisher india center in Hyderabad: new MOU with Google.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X