కేటీఆర్ కు స్వాగతం పలికిన జగన్ ఫ్యాన్స్, ఖమ్మంలో ఆసక్తికర ఘటన

బీఆర్ఎస్ - వైసీపీ మధ్య బంధం రోజురోజుకు బలపడుతుందా? తెలుగు రాష్ట్రాల్లో అటు జగన్, ఇటు కేటీఆర్ సీఎం కావాలని యూత్ పరితపిస్తోందా? రెండు రాష్ట్రాల్లో అధిక జనాధరణ కలిగిన ఇద్దరు యువనేతలు ఏ ప్రాంతంలో పర్యటించినా అక్కడ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఏపీలో జగన్ టూర్ లో రప్ప-రప్ప అంటుంటే.. తెలంగాణలో కేటీఆర్ టూర్ లో గులాబీ అభిమానులు దేక్లేంగే అంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కేటీఆర్ టూర్ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది

ఖమ్మం జిల్లా... వైఎస్ కుటుంబానికి ఈ ప్రాంతంలో అభిమానులు భాగానే ఉన్నారు. ఇక్కడి నుంచి వైసీపీ ఆవిర్భావ సమయంలో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎంపీగా గెలిచారు. అయితే రాష్ట్రాలుగా విడిపోయినా వైఎస్ కుటుంబంపై మాత్రం అక్కడి ప్రజానీకం ఎక్కవ ప్రేమను కనబరుస్తున్నారు. ఈ టైంలోనే ఈ రోజు ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోకి కేటీఆర్ కాన్వాయ్ ఎంట్రీ ఇవ్వగానే బీఆర్ఎస్ అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడే ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది.

కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా, ఊహించని విధంగా అక్కడ వైసీపీ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాకుండా.. జై జగన్.. జై కేటీఆర్ అంటూ రెండు పార్టీల నేతలను కలిపి నినాదాలు చేయడం విశేషం. గులాబీ జెండాల మధ్య వైసీపీ ఫ్యాన్ గుర్తు జెండాలు రెపరెపలాడటం చూస్తుంటే, రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

KTR s Khammam Visit Draws Attention as YSRCP Flags Welcome BRS Leader in Naikangudem

జగన్ పుట్టినరోజున తాడేపల్లిలో..

ఇటీవల జగన్ పుట్టిన రోజు సమయంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కమ్ జగన్ నివాసం ముందు భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఈ పోస్టర్లు ఉన్నాయి. వైఎస్ జగన్ తో కేసీఆర్, కేటీఆర్ బంధాన్ని గుర్తుచేసేలా వీటిని ఏర్పాటు చేశారు.

బెంగళూరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో..


అంతకు ముందు బెంగళూరు శివార్లలోని తరహుణిసెలో సర్జ్ స్టేబుల్స్‌లో ఏర్పాటైన ఓ ప్రైవేట్ ఈవెంట్ కు ఈ యువనేతలిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు వైఎస్ జగన్, కేటీఆర్. ఈవెంట్ ఆరంభం నుంచి ముగిసిపోయేంత వరకూ ఇద్దరూ కలిసే ఉన్నారు. సరదాగా మాట్లాడుతూ కనిపించారు. రాజకీయాలతో బిజీగా గడిపే ఈ ఇద్దరు పొలిటికల్ జెయింట్లు.. ఇక్కడ కలివిడిగా గడిపారు. వైఎస్ జగన్ తో సమావేశం కావడంపై తాజాగా స్పందించారు కేటీఆర్. ఆయనను అన్న గా సంబోధించారు. ఈ భేటీ గొప్పగా జరిగిందని అన్నారు. బెంగళూరులో ఓ ప్రైవేట్ ఈవెంట్ లో జగన్ అన్నను కలుసుకోవడం గొప్పగా అనిపించిందని కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్- కేటీఆర్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లల్లో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి. 2028లో కేటీఆర్, 2029లో వైఎస్ జగన్ మళ్లీ తమ తమ రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతోన్నారనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

సరిహద్దులు వేరైనా..

ఇప్పుడు తాజాగా కేటీఆర్ కు కనబడేలా జగన్ ఫ్యాన్స్ నాయకన్‌గూడెంలో జరిగిన ర్యాలీ చేసిన సందడి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. "సరిహద్దులు వేరైనా.. మా నాయకుల దోస్తీ ఒక్కటే" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, తెలంగాణ గడ్డపై వైసీపీ జెండాలు కనిపించడం ఖమ్మం రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు వేదికగా మారింది. రాజకీయ రంగులేవైనా, కేటీఆర్ ర్యాలీలో జగన్ అభిమానుల సందడి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+