జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ సంచలనం, మరో ఉప ఎన్నిక..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు. ఇప్పుడు రాజకీయంగా అందరిలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం పైన చర్చ జరుగుతోంది. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు ప్రతిష్ఠాత్మకం గా మారింది. త్రిముఖ పోరులో గెలిచేందుకు పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఫలితం పైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో మరో ఉప ఎన్నిక పైన కేటీఆర్ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు కారణమయ్యాయి.
జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ అధికారం లో ఉండటంతో.. గెలుపు ఇతర పార్టీల కంటే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ముగ్గురు మంత్రులను పార్టీ రంగంలోకి దించింది. బీఆర్ఎస్ ముందుగానే అభ్యర్ధిని ప్రచారంలోకి దింపి.. సెంటిమెంట్ అస్త్రం గా ప్రచారం చేస్తోంది. పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. కాగా.. కేటీఆర్ ఇక్కడ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఇక.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం పైన కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్‌లో కొట్టబోతుందని స్పష్టం చేశారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామని తేల్చి చెప్పారు. అదే విధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

ఇక, కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యమని స్పష్టం చేశారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని.. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరెవర్ని ఏం చేయాలో, ఎవరి బెండ్ ఎలా తీయాలో, తీసి తీరుతామని హెచ్చరించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారన్న అందరి జాతకాలు తనకు తెలుసని.. లెక్కలన్ని తేలుస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పేదల ఇంటి స్థలాల పైన పడుతున్న హైడ్రా పెద్దల ఆక్రమణలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. తనకు భూములు ఉన్నాయని ఆరోపిస్తున్న రేవంత్.. ఎక్కడ ఉన్నాయో నిరూపించాలని సవాల్ చేసారు.












Click it and Unblock the Notifications