నా కోరికను నెరవేర్చండి: అశోక్ గజపతిరాజుతో ఢిల్లీలో కేటీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలో ప్రాంతీయ వైమానిక మార్గాల అనుసంధానంపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ తరుపున మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విమానయాన రంగంలో నూతన పాలసీలు తీసుకొచ్చినందుకు అభినందనలు తెలిపారు.

KTR met Civil aviation minister ashok gajapathi raju in new delhi

రీజనల్ కనెక్టివిటీ విధానంలో ఈసీఓ సిస్టం, అనుసంధానం, ఉద్యోగ కల్పన లాంటివి కీలకాంశాలుగా పేర్కొన్నారు. ఏవియేషన్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధానం ఇవ్వాలని ఆయన సూచించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విమానయానానికి, రోడ్డు ప్రయాణానికి రవాణా సమయంలో తేడా ఉండటం లేదని అన్నారు.

ఈ క్రమంలో సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి కేటీఆర్, కేంద్ర పౌర విమానయాన మంత్రి పి అశోక్ గజపతిరాజుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి అమెరికాలోని డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమాన సేవలను ప్రారంభించాలని కోరారు.

KTR met Civil aviation minister ashok gajapathi raju in new delhi

దీనికి కేంద్రం తనవంతు సాయం చేయాల్సిందిగా ఆయన్ని కోరారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్, కొత్తగూడెంలలో చిన్న విమానాశ్రయాలను గ్రీన్ ఫీల్డ్ పద్ధతిలో నిర్మించాలని కూడా కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును కోరానని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

KTR met Civil aviation minister ashok gajapathi raju in new delhi

వీటితో పాటు ఆలేరు, కాగజ్ నగర్‌లో హెలిపోర్ట్స్ ఏర్పాటు చేయమని సూచించానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్, బసంత్‌నగర్, నాగార్జునసాగర్, నల్లగొండలో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తన విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana IT minister KTR met Civil aviation minister ashok gajapathi raju in new delhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి