KTR: సోదరి కోసం రామన్న ఢిల్లీ బాట.. సీబీఐ ఆఫీస్ లో కేటీఆర్..!
మద్యం కుంభకోణంలో అరెస్టయిన సోదరి, ఎమ్మెల్సీ కవిత కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ ప్రధాన కార్యలయంలో కవితను కలిశారు. కవితన కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు కవిత భర్త, న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. కవితను కేటీఆర్ ఎందుకు కలిశారో తెలియరాలేదు. కవితను సీబీఐ అరెస్ట్ చేసిన కేటీఆర్ మొదటిసారి ఆమెను కలిశారు. సీబీఐ ఏం అడిగింది.. ఏం సమాధానాలు చెప్పవు అని కేటీఆర్ కవితను అడిగినట్లు తెలిసింది.
అలాగే ఈ కేసుకు సంబంధించి లీగల్ గా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. కవితను సీబీఐ మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుంది. సీబీఐ కస్టడీ ఏప్రిల్ 15తో ముగుస్తుంది. ఆ తర్వాత కవితని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు కవితను ఈడీ కూడా విచారించింది. లిక్కర్ స్కామ్ లో గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు చెప్పినట్లు తెలిసింది. బుచ్చిబాబు వాట్సాప్ చాటింగ్ లో కవిత పేరు ఉండడంతో బుచ్చిబాబును ప్రశ్నించారు. దీంతో అతను కవిత పేరు బయట పెట్టినట్లు చెబుతున్నారు.

దీనిపై సీబీఐ కోర్టు ముందు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.. హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్లు పలు పత్రాలు దొరికాయని సీబీఐ తెలిపింది. రూ.100 కోట్లను తరలించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ హోల్ సేల్ లైసెన్స్ లో భాగంఉందని వివరించంది. ఇదంతా బుచ్చిబాబు, కవితకు మధ్య జరిగిన ఫోన్ కాల్ ద్వారా బహిర్గతమైందని సీబీఐ స్పష్టం చేసింది. 2021 సెప్టెంబర్ 20న ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్ సింగ్లో ఫెర్నార్డ్ రికార్డు ఇండియా నిర్వహించిన మీటింగ్ లో అరబిందో గ్రూప్ కు చెందిన శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, సమీర్ మహేంద్ర, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్ పల్లి పాల్గొన్నారని తెలిపింది.
ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు ఫెర్నార్డ్ రికార్డు సంస్థకు చెందిన మనోజ్ రాజ్ మొబైల్ ఫోన్ లో లభించాయని పేర్కొంది. అయితే కవిత మాత్రం తాను తప్పు చేయలేదని చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసు విచారణ సంవత్సరానికి పైగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications