హైదరాబాద్ నగరానికి ఏమైంది - ఎందుకిలా..!!
మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు...వస్తున్న వార్తా కథనాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసారు. ఈ మహానగరానికి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని... హత్యలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ సర్కార్‌పై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కేటీఆర్ ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారుతోంది. నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థమని వివరించారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. "బ్రాండ్ హైదరాబాద్" ఎందుకు మసకబారుతోంది ?? విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ.. ఎందుకింత కళ కోల్పోతోంది ?? అని సగటు హైదరాబాదీకి అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఇదే ఆవేదన ఉందని తెలిపారు.

భద్రత లేకుండా
పదేళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు.. పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు పెరిగిపోతున్నాయని అన్నారు. రాజధాని హైదరాబాద్‌లో శాంతి లేదని.. నగర ప్రజల జీవితాలకు భద్రత లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గారు స్వయంగా...పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా.. పోలీసింగ్‌పై కమాండ్ ఏది అని ప్రశ్నించారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది అని నిలదీశారు. ఓవైపు.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం.. పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదు.."తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ " అని కేటీఆర్ స్పష్టం చేశారు.
"ఈ మహా నగరానికి ఏమైంది..?"
— KTR (@KTRBRS) July 11, 2024
ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం!
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా… pic.twitter.com/RF7aVlR7x6
ప్రగతికి బ్రేకులు
మరోవైపు.. పడగవిప్పిన హత్యల సంస్కృతి.. ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోందన్నారు. ఇంకోవైపు.. తరలిపోతున్న పెట్టుబడుల పర్వం.. యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పవర్ లోకి రాగానే గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ అని కేటీఆర్ ప్రశ్నించారు. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుందని నిలదీశారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని ప్రశ్నించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి.. పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే.. అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా ?? దేశ రాజధాని చుట్టూ.. రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ.. చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ?? అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications