Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికాలో జాహ్నవి మృతి కేసు ముగింపు విచారకరమన్న కేటీఆర్

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jahnavi Kandula) మృతి కేసును నీరుగార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. జాహ్నవి మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు చెప్పడంతో అమెరికా కోర్టు నిందితుడ్ని విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు శిక్ష పడకపోవడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ అంశంపై అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ktr reacts on jaahnavi kandula death case in america

అంతేగాక, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి.. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ కోరారు. ఉన్నత లక్ష్యాలతో అమెరికాకు వెళ్లిన జాహ్నవి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమైతే.. ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) 2023 జనవరిలో సియాటెల్‌లో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ.. పగలబడి నవ్విన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. 'ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు' అన్నట్లు ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. అయితే, ఈ కేసులో విచారణ మాత్రం నిందితుడికి శిక్షపడేలా జరగకపోవడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+