సోనూ సూద్‌పై ఐటీ, ఈడీ దాడులు అందుకే: కేటీఆర్ సంచలనం, రియల్ హీరో ప్రశంసలు

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, ఎంతో మంది పేదలను ఆదుకున్న సోనూ సూద్‌కు అండగా తాముంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనూ సూద్ తోపాటు కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేయడం చాలా సులభమని, బాధ్యతగా సేవ చేయడం గొప్ప విషయమని చెప్పారు. సోనూ సూద్ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలతో ఆయన్ను భయపెట్టాలని చూశారని, అతడి వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు.

సోనుసూద్‌ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతనిపై దుష్ప్రచారం చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే సోనుసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు చేయించారన్నారు. సోనుసూద్‌ రియల్‌ హీరో అనీ.. ఇలాంటి వాటికి సోనుసూద్‌ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాము అండగా ఉంటామన్నారు కేటీఆర్. కొవిడ్‌ కష్టకాలంలో సోనుసూద్‌ సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని.. సేవతో ప్రపంచం దృష్టి ఆకర్షించారన్నారు.మంచి పనులు చేస్తూ ఉండాలని, సోనూ సూద్‌తో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్య తెలిపారు.

KTR response on IT, ED raids on Sonu sood

ఆ తర్వాత సోనూ సూద్ మాట్లాడుతూ.. కేటీఆర్‌లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండదని అన్నారు. కరోనావైరస్ మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని, బాధితులకు సహాయ పడటమే మన ముందున్న సవాలని చెప్పారు. జమ్మూ నుంచి కన్యా కుమారి వరకు సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు. 7.50 లక్షల మందికి సాయం చేశానని చెప్పారు. తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని, అది కేటీఆర్ కార్యాలయం అని సోనూ సూద్ ప్రశంసించారు.

కాగా, సోనూ సూద్ కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఎంతో మంది పేద ప్రజలకు సాయం చేసిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చేందుకు సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేశారు. రైలు, విమానాల్లోనూ తరలించారు. అంతేగాక, సహాయం కోరిన చాలా మందిని ఆదుకున్నారు. ఈ క్రమంలో ఆయన రియల్ హీరోగా మారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+