Telangana: పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ: కేటీఆర్
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) హైదరాబాద్ నానక్ రామ్ గూడలో స్టెల్లాంటీస్ డిజిటల్ హబ్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కేరాఫ్ గా మారిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాఫ్ట్ వేర్ రంగంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలతోనే కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు.
తాజాగా తెలంగాణలో ఆరిజెన్ ఫార్మా సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఫార్మా సంస్థ జీనోమ్ వ్యాలీలో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో 250 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఆరిజెన్ ఫార్మా సంస్థ మంగళవారం కేటీఆర్ తో సమావేశం అయ్యారు. భేటీ అనంతరంలో హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టనున్నట్లు ఆరిజెన్ ఫార్మా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో ఆరిజెన్ ఫార్మా సంస్థ పెట్టుబడులు పెట్టడంపై కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

మానవ వనరులు, నైపుణ్యానికి హైదరాబాద్ వేదికగా మారిందన్నారు. రాష్ట్ర రాజధానిలో అభివృద్ధి విప్లవంలా కొనసాగుతోందన్నారు. భాగ్యనగరం వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. దేశంలోని ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే ఉంటున్నాయని చెప్పారు. తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మధ్యాహ్నం బేగంపేట మెట్రోభవన్‌లో పురపాలక శాఖ సాధించిన విజయాలను, అభివృద్ధిని దశాబ్ధి నివేదికను కేటీఆర్ విడుదల చేశారు.
హైదరాబాద్‌లో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో భాగ్యనగరానికి నిత్యం మంచినీటి సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం 35 ఫ్లైఓవర్లు పూర్తి చేస్తే.. కేంద్ర ప్రభుత్వం 2 ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేయలేకపోతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications