ట్రాఫిక్ సమస్య: చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి వచ్చే మూడేళ్ల లోపు సిగ్నల్ ఫ్రీ కారిడార్లు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చైనా తరహాలో ఎక్కడా వాహనం ఆపే అవసరం లేకుండా రాజధానిలో రోడ్లు, ప్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు, మాదాపూర్ మైండ్‌స్పేస్, మలేషియా టౌన్‌షిప్‌ల వద్ద మల్టీలెవల్ ప్లైఓవర్ల నిర్మాణాలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ఇతర మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో మొత్తం 54 జంక్షన్లలో మల్టీలెవల్ ప్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు. నగరాభివృద్ధి కోసం అన్ని పార్టీలు రాజకీయాలకతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి పై చిలుకు ఉందని చెప్పిన ఆయన రాబోయే పదేళ్లలో పది కోట్లకు చేరుకుంటుందన్నారు.

 చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

రాజధానిలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించిందని మంత్రి చెప్పారు. నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా రద్దీ కారణంగా గంటలకొద్దీ సమయం పడుతున్నదన్నారు. వచ్చే పదేండ్లలో నగర జనాభా ఎన్నోరెట్లు పెరిగే అవకాశముందని, అప్పుడు రవాణా సమస్యలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చునన్న దూరదృష్టితో ప్రభుత్వం ముందస్తు పరిష్కారమార్గాలను అన్వేషిస్తున్నదన్నారు.

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

అందుకే సుమారు రూ.20వేల కోట్ల వ్యయంతో నగరంలో సిగ్నల్‌ఫ్రీ రహదారులు ఏర్పాటుచేయాలని నిశ్చయించినట్లు కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా ఒక్క కేబీఆర్ పార్కు చుట్టే ఆరు జంక్షన్లలో రూ. 510కోట్లతో మల్టీలెవల్ ప్లైఓవర్లు నిర్మిస్తున్నామన్నారు.

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

వీటితోపాటు శివారు ప్రాంతాలను కలిపేందుకు ఉప్పల్-ఘట్‌కేసర్, జూబ్లీబస్టాండు-శామీర్‌పేట్, పారడైజ్-కొంపల్లి, ఎల్బీనగర్ వంటి చోట్ల నాలుగు కారిడార్లు నిర్మించాలని నిశ్చయించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే వీటి నిర్మాణానికి కేంద్ర సహకారం అవసరం అవుతుందని తెలిపారు.

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

బీహార్‌కు రూ.1.80 లక్షల కోట్లు, జమ్మూకశ్మీర్‌కు రూ.80వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం అనాదిగా వెనుకబాటుకు గురైన, కొత్త రాష్ట్రమైన తెలంగాణకు లక్ష నుంచి రెండు లక్షల కోట్లమేరకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీని సాధించేందుకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కృషిచేయాలని కోరారు.

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

కేంద్రం సొంతంగా ఇచ్చేదేమీ లేదని, మనం కట్టిన పన్నులనుంచే మనకు అందులో వాటా ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ర్టానికి కేంద్ర నిధుల నుంచి రావాల్సిన ఈ న్యాయమైన వాటాను రాబట్టుకునేందుకు పోరాడతామని ఆయన స్పష్టంచేశారు.
 చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

రాష్ట్రంలో కరెంటు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ. 25వేల కోట్లు ఖర్చుచేస్తున్నదని, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి ఇప్పటికే రూ. 200 కోట్లు ఖర్చుచేసిందని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య పనుల కోసం ఇటీవలే 2000ఆటో టిప్పర్లు కొనుగోలు చేశామని, ఇంటికి రెండు చొప్పున 21లక్షల కుటుంబాలకు 42 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

 చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రూ. 20వేల కోట్లతో భారీ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఎండాకాలం కూడా కరెంటు కోతల్లేకుండా చేసిన ఘనత సిఎం కేసీఆర్‌దేనన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆగమాగం చేసిన పార్టీలకు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని కెటిఆర్ అన్నారు.

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నగరాభివృద్దికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువస్తానన్నారు. మౌలిక సదుపాయాలు పెరిగితే పరిశ్రమలు, వాటి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

 చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

చైనా తరహాలో మూడేళ్లలో స్కైవేలు నిర్మిస్తామన్న కేటీఆర్

హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే మూడవ బెస్ట్ సిటీగా, దేశంలో నెంబర్ వన్ క్యాపిటల్ సిటీగా కాబోతున్నదని ప్రముఖులు అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూం స్కీం చాలా చక్కటి పథకమని, ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం నిర్మించే ఒక్కో ఇంటికి కేంద్రం రూ. 2లక్షలు మంజూరు చేస్తుందని, ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించినా, నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+