కేసీఆర్‌కు కేంద్రమంత్రుల ప్రశంస, ఐటీ ఎగుమతులు రెట్టింపు: కేటీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: కేసీఆర్ పాలనను కేంద్రమంత్రులు కూడా ప్రశంసిస్తున్నారని, ఈ పరిణామాలను స్థానిక బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

బీజేపీలో కలకలం: మేం కష్టపడుతుంటే కేసీఆర్‌పై మీరు అలాగేనా! ఇరకాటంలో టి నేతలు

తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని గత పాలకులు చెప్పారని, ఆ అపోహలన్నింటినీ మూడేళ్లలోనే తమ ప్రభుత్వం పటాపంచలు చేసిందన్నారు. కరీంనగర్‌లో ఐటీ టవర్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

KTR says union ministers praising KCR government

ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌ రాష్ట్రంలో ఎదిగిందన్నారు. మూడున్నరేళ్లలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోరాటపటిమ వల్లనే ఇదంతా సాధ్యమైందన్నారు.

తెలంగాణ వచ్చేనాటికి ఉన్న ఐటీ ఉత్పత్తులను అయిదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మూడున్నరేళ్లలోనే దానికి దగ్గరగా వస్తున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందన్నారు.

ఐటీ రంగంలో మూడేళ్లలోనే లక్ష వరకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు వచ్చాయని చెప్పారు. ఐటీ ఎగుమతులను రెట్టింపు చేశామని చెప్పారు. రాష్ట్ర యువతకు పని చేసే చోటే ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana IT minister KT Rama Rao on Monday said that union ministers are praising K Chandrasekhar Rao's government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి