కాంగ్రెస్ ఒకేఒక్క అజెండా అదే; కుత్సితమైన చిల్లర రాజకీయం: భగ్గుమన్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ నేటి నుంచి నామినేషన్ల పర్వం కూడా షురూ అయింది. ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి నుండే కొనసాగిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక తెలంగాణలో రైతాంగం సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాయి.

కాంగ్రెస్ ఎన్నికల నీచ రాజకీయాలు: కేటీఆర్
ఇక ఈ సమయంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టిన కేటీఆర్ కాంగ్రెస్ ఎన్నికల కోసం నీచ రాజకీయాలకు దిగుతుందని అసహనం వ్యక్తం చేశారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందని వివిధ పేపర్ క్లిప్పింగ్ లతో ఆసక్తికర పోస్ట్ పెట్టారు కేటీఆర్.

KTR shocking allegations on congress party

రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది
మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారని , డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకు వచ్చిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊసే లేకుండా కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు.

కాంగ్రెస్ అజెండా అదే
కెసిఆర్ ను బద్నాం చేయాలని ఒకే ఒక్క అజెండాతో కాఫర్ డ్యామ్ కట్టకుండా రైతులను నిండా ముంచాలని చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఇది అని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

కాపర్ డ్యాం కట్టకుండా అడ్డుకున్న కాంగ్రెస్ సర్కార్
మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీ వ్యవహారం నేపథ్యంలో కాపర్ డ్యాం కడతామని ఎల్ అండ్ టి సంస్థ అంగీకరించినట్టు వార్తలు వస్తున్న క్రమంలో, ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరమ్మతులు వద్దని ఆదేశించారని, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+