అజహరుద్దీన్‌ను అక్కడ తన్నితరిమేశారు: కేటీఆర్ సంచలన విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు మనం కూడా కొడుదామా? షమీ హ్యాట్రిక్ తీసిండు.. మనం కూడా హ్యాట్రిక్ కొడుదామా? వంద శాతం కొడుదామా? అని ప్రజలతో వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అజహరుద్దీన్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ ప్రచారానికి వస్తే క్రికెట్ ఆడండి. పిల్లలతో గల్లీలో జబర్దస్త్ క్రికెట్ ఆడించండి. కానీ ఓట్లు మాత్రం మాగంటి గోపీనాథ్‌కు వేయండి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు అజహరుద్దీన్‌ను తన్ని తరిమేశారన్నారు. అక్కడ చెల్లని అజహరుద్దీన్ ఇక్కడ చెల్లుతారా? అని ప్రశ్నించారు.

కరోనా సమయంలో బయటకు రావడానికి మీరంతా భయపడ్డారు. కానీ, గోపీనాథ్ గల్లీ గల్లీ తిరిగి పేదవారికి అండగా నిలబడ్డారు. రహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ అలా ప్రతి డివిజన్‌లో, ప్రతి కాలనీలో సమస్యలు తెలిసిన వాడు మాగంటి గోపినాథ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. అజహరుద్దీన్‌కు ఇక్కడ ఏ గల్లీ కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
Live: జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, శ్రీరామ్ నగర్ రోడ్ షో లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్.#VoteForCar #KCROnceAgain https://t.co/cqLtmADPms
— BRS Party (@BRSparty) November 17, 2023
కేసీఆర్ ప్రభుత్వం కులం పేరుతో కుంపట్లు పెట్టలేదు. మతం పేరుతో మంటలు పెట్టలేదు. ప్రాంతం పేరుతో పంచాయితీ పెట్టలేదు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ, బీహార్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక కేరళ ఎవరైనా కావొచ్చు.. హైదరాబాద్‌లో ఉన్నోళ్లంతా మావారే, మా బిడ్డలే అని చూసుకున్నాం అని అన్నారు కేటీఆర్. పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి ఏందీ? ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇన్వర్టర్లు, జనరేటర్లు, షాపుల్లో కరెంట్ ఉండేది కాదు. మళ్లీ ఆ దిక్కుమాలిన రోజులు కావాలా..? కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా..? ఆలోచించండి. పొరపాటున తప్పు చేస్తే ఆ పాత చీకటి రోజులు తిరిగి వస్తాయి. మళ్లీ కరెంట్ కోతలు, కంపెనీల మూతలు, మళ్లీ ఛార్జీల మోతలు తయారైతది అని కేటీఆర్ హెచ్చరించారు.
BRS Working President, Minister @KTRBRS addressing the gathering at a road show in Yousufguda, Jubilee Hills Constituency#VoteForCar #KCROnceAgain https://t.co/dgyIavaCBq
— BRS Party (@BRSparty) November 17, 2023
ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణ ఉందని కేటీఆర్ చెప్పారు. విద్యుత్, మంచినీళ్లు వస్తున్నాయన్నారు. రోడ్లు మంచిగా ఉన్నాయి. డ్రైనేజీలను మంచిగా చేస్తాం. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వచ్చింది. ఇప్పుడు గెలిస్తే మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తున్నాం. మహిళలకు సౌభాగ్య లక్ష్మీ కింద నెలకు రూ. 3 వేలు మీ ఖాతాలో వేస్తాం. మతం, కులంతో సంబంధం లేకుండా ఈ పథకం అమలవుతుందన్నారు.
ఆసరా పెన్షన్లు పొందుతున్న వారికి 5 వేలు.. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి డిసెంబర్ 3 తర్వాత సన్నబియ్యం ఇస్తాం ఇది మా బాధ్యత. కేసీఆర్ బీమా పేరుతో 5 లక్షల జీవిత బీమా కూడా ప్రారంభించబోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ లేదని, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వొద్దని పిలపునిచ్చారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications