ఢిల్లీలో కేటీఆర్, టార్గెట్ రేవంత్ - కీలక పరిణామం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ ఢిల్లీలో కీలక మంత్రాంగం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం అమృత్ టెండర్ల విషయంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఇటు బీఆర్ఎస్ ముఖ్యుల అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం సాగుతన్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ బాట పట్టారు. రేవంత్ పైన కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ పరిణామాల వేళ రాజకీయం హోరా హోరీగా సాగుతోంది.
ఢిల్లీకి కేటీఆర్
మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. పార్టీలోని ముఖ్యులతో కలిసి ఢిల్లీ బాట పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ పై ఫిర్యాదు చేసేందుకు పూర్తి సమాచారంతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమృత్ టెండర్ల పైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం సాగింది. రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇక, మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల్లో అనేక ఆధారాలు దొరికాయని.. రాజకీయ బాంబులు పేలుతాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కేంద్రానికి ఫిర్యాదు
ఇక, ఫార్ములా రేసు నిధుల విడుదల అంశంలో కేటీఆర్ అరెస్ట్ ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ సమయంలోనే ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కేటీఆర్ కలిసి అమృత్ టెండర్ల విషయంలో ఫిర్యాదు చేయనున్నారు. అమృత్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని సృజన్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేసారు. రూ. 8,888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ ప్రధాన ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ధి సృజన్ రెడ్డికి టెండర్లు ఇచ్చారని బీఆర్ఎస్ ఆరోపణలు కంటిన్యూ చేస్తోంది. తో, ఈ టెండర్ల పై కేంద్ర భుత్వం విచారణ చేపట్టాలని కేటీఆర్ కోరేందుకు సిద్దమయ్యారు.
కేంద్రానికి లేఖలు
ఇప్పటికే ఈ ఆరోపణల పైన విచారణ చేయాలని కేటీఆర్ కేంద్ర మంత్రులు నోహర్‌లాల్ ఖట్టర్, టోచన్ సాహులకు లేఖ రాశారు. దీనిపై విచారణ చేసి నిజనిజాలు నిగ్గుతేల్చాలని లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడే అవినీతిలో కేంద్రానికీ వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లేఖల అంశాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టెండర్లు, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ.1500కోట్ల విలువైన పనలను సీఎం రేవంత్ తన కుటుంబసభ్యులకే కేటాయించుకున్నారని కేటీఆర్ తన లేఖలో ఆరోపించారు.












Click it and Unblock the Notifications