ఫిట్ నెస్ ఫై ఫోకస్ పెట్టిన కేటీఆర్.. !!

భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసే ఆలోచన కూడా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సెటైర్లూ వేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయబోతోన్నారనేదీ వివరించారు.

  • పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉన్నా.. దీనికి ఇంకా కొంత సమయం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడేళ్లు పట్టొచ్చని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. పాదయాత్రకు ఇప్పడిప్పుడే తొందరేం లేదని కేటీఆర్ వివరించారు. పాదయాత్ర మాత్రం తప్పకుండా ఉంటుందని కేటీఆర్ అన్నారు.
KTR Unveils Major Issues in Engaging Media Conversation
  • ప్రస్తుతం శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోన్నానని కేటీఆర్ పేర్కొన్నారు. కొంత స్లిమ్ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయ కార్యకలాపాలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ మధ్య కాలంలో జిమ్ కు కొంత గ్యాప్ ఇచ్చానని, మళ్ళీ స్టార్ట్ చేస్తానని చెప్పారు.
  • జనంలోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడని, ఇందులో సందేహాలు అక్కర్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు కూడా కేసీఆర్ విలువ తెలిసిందని వ్యాఖ్యానించారు. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ జపం చేస్తున్నాడని, జనంలోకి ఎప్పుడూ రావాలో ఆయనకు తెలుసునని అన్నారు..
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిపాటు సమయం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చామని ఇప్పుడా గడువు తీరుతోందని కేటీఆర్ అన్నారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదని అంచనావేశారు. గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
  • అజారుద్దీన్ క్రికెట్ లో బాగా కట్ షాట్లు ఆడేవాడని, ఇప్పుడు ఆయనకే పెద్ద కట్ కొట్టారని సెటైర్లు వేశారు కేటీఆర్. అజారుద్దీన్ ను సంతృప్తి పరిచేందుకు, ముస్లింల ఓట్ల కోసం ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని అన్నారు. అజారుద్దీన్ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయారని చెప్పారు.
  • ఎనుముల రేవంత్ రెడ్డి కాస్తా.. ముడుపుల రేవంత్ రెడ్డి అయ్యాడని కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఎల్ అండ్ టీ వాళ్ళనీ ముడుపుల కోసం రేవంత్ భయపెట్టాడని విమర్శించారు. అందుకే మెట్రో రైల్ ను నడపడం తమ వల్ల కాదని, వెళ్ళిపోతామని అంటున్నారని చెప్పారు. రేవంత్ బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవాలనుకుంటోందని అన్నారు.
  • ముడుపుల కోసం వేధింపులు తట్టుకోలేకనే ఆ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలనుకుంటోందని కేటీఆర్ చెప్పారు. గతంలో ఎల్ అండ్ టీ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ను జైల్లో పెడతానని రేవంత్ బెదిరించాడని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటుందని ఎదురుప్రశ్న వేశారు.
  • అనేక వివాదాలు ఉన్న ఎమ్మార్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మ బోతున్నాడని, గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని ఆరోపించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+