తెలంగాణ వినోద రంగంలోకి వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డిస్క‌వ‌రీ: అమెరికాలో కేటీఆర్ కీలక భేటీ

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. తాజాగా, న్యూయార్క్‌లో మంత్రి కేటీఆర్‌తో డిస్క‌వ‌రీ ప్ర‌తినిధులు భేటీ అయ్యారు. టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌లు, ఫ్రాంచైజీల పోర్ట్‌ఫోలియోకు ప్రసిద్ధి చెందిన గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మేళనం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్ర‌వేశించేందుకు ఆసక్తి కనబర్చింది.

ఈ మేర‌కు వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డిస్క‌వ‌రీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డిస్క‌వ‌రీ తెలంగాణ వినోద రంగంలోకి ప్ర‌వేశిస్తోంది. తెలంగాణ వినోద రంగంలోకి డిస్క‌వ‌రీ రావ‌డం సంతోష‌క‌రమని పేర్కొన్నారు. క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా ఐడీసీ(అంత‌ర్జాతీయ అభివృద్ధి కేంద్రం)ని డిస్క‌వ‌రీ ఏర్పాటు చేస్తుంద‌న్నారు. మొద‌టి ఏడాదిలోనే 1200 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని కేటీఆర్ వెల్లడించారు.

KTR US visit: Warner Bros. Discovery to set up development centre in Hyderabad

కాగా, ఇటీవలో మంత్రి కేటీఆర్ బ్రిటన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక్కడి కంపెనీలు కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని(టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ముందుకొచ్చింది.

ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరానికి నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. మంత్రి కేటీఆర్‌తో లండన్‌లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఈవో అంథోనీ మెక్‌కార్టీ ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలతో ఆంతోనీ మెక్ కార్టీ కుదుర్చుకున్నారు.

తెలంగాణలో ఈ సంస్థ టెక్నాలజీ సెంటర్‌ను నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్య్సూరెన్స్ రంగాలకు అద్భుతమైన ఊతం లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా రంగాల్లో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని మంత్రి వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్చ్సేంచ్ గ్రూప్ దాదాపు 190 దేశాల్లో ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. తన విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవా రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+