రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్.. ప్రభుత్వంపై ఫైర్
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 20 మంది దాడి ఆయనపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. రంగరాజన్‌పై దాడి అత్యంత దుర్మార్గం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రంగరాజన్ పై జరిగిన దాడిని తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు.. హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
రంగరాజన్‌పై దాడి అత్యంత దుర్మార్గం అని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని మండిపడ్డారు. అలాగే రంగరాజన్‌ను అవమానిస్తే దేవుడిని అవమానించడమేనని.. ఆయనపై దాడికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేటీఆర్ కోరారు. చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గర భద్రత పెంచాలని ప్రభుత్వానికి, పోలీసులకు కేటీఆర్ విజ్ఙప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున తాము రంగరాజన్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ధర్మరక్షకులు దాడులు చేస్తారు…
— KTR (@KTRBRS) February 10, 2025
రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు 👏🏼
Chilkur temple chief priest and a great scholar Shri Rangarajan garu was attacked two days ago by fringe elements.
Not a word from the protectors of Hinduism on this act of cowardice
There are videos of the…
రామ రాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని.. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌందర్ రాజన్ పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని చెప్పారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.
మరోవైపు దాడి ఘటనపై చిలుకూరు పూజారి రంగరాజన్‌తో మాట్లాడినట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రంగరాజన్ క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నానని రాసుకొచ్చారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications