Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం: రంగంలోకి కేటీఆర్, సమస్యలపై ఆరా

'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' సామెత మాదిరి అయింది హైదరాబాద్‌లోని లోతట్టు కాలనీల్లోని ప్రజల పరిస్థితి. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువుల కట్టలు తెగి దాదాపు 1000 అపార్ట్ మెంట్లలోకి చేరిన నీరు ఇంకా పూర్తిగా బయటకు వెళ్లలేదు.

ఒంటి గంట నుంచి వర్షం

ఒంటి గంట నుంచి వర్షం

అయితే ఈ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తిరిగి వర్షం మొదలైంది. నాంపల్లి, కోటి, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, జీడిమెట్ల, ఖైరతాబాద్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, కుషాయిగూడ, ఈసీఐఎల్, మల్కాజ్ గిరి, లాలాపేట, తార్నాక, ఉప్పల్, సరూర్ నగర్, బంజారాహిల్స్, మాదాపూర్, చార్మినార్, చంపాపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

స్తంభించిన జనజీవనం

స్తంభించిన జనజీవనం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. దీంతో మరోసారి రోడ్లపైకి నీరు చేరగా, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షపు నీటిలో అధికభాగం ఇప్పటికే నిండుకుండగా ఉన్న హుస్సేన్ సాగర్ కు చేరుతుండగా, ఔట్ ఫ్లోను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

లుంబినీ పార్కులోకి చొచ్చుకొచ్చిన వరద నీరు

లుంబినీ పార్కులోకి చొచ్చుకొచ్చిన వరద నీరు

హుస్సేన్ సాగర్ నీరు లుంబినీ పార్కులోకి చొచ్చుకొచ్చింది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ నగరంలోని వర్షపు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ నిజాంపేటలో పర్యటిస్తున్నారు.

అభివృద్ధి పనులకు రూ.91 లక్షలు

అభివృద్ధి పనులకు రూ.91 లక్షలు

అక్కడి అభివృద్ధి పనులకు రూ.91 లక్షలు కేటాయించారు. అక్కడి ప్రజలను వర్షం వస్తే తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చారు. మంత్రితోపాటు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ పర్యటనలో ఉన్నారు.

రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశం

రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశం

యుద్ధ ప్రాతిపదికన లోతట్టు ప్రాంతాల వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అనంతరం నిజాంపేట బంజరు లే ఔట్ ప్రాంతంలో కేటీఆర్ పర్యటించారు. తమ ప్రాంతాల్లో నాలలో్లని నీరు సరిగా బటయకు వెళ్లగా తమ ఆపార్ట్ మెంట్లన్ని నీటమునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షపు నీటిలో చిక్కుకున్న అపార్ట్ మెంట్లు

వర్షపు నీటిలో చిక్కుకున్న అపార్ట్ మెంట్లు

వర్షపు నీటిలో చిక్కుకున్న అపార్ట్ మెంట్లను మంత్రి పరిశీలించారు. ఇకపై నీల్లు నిలువకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదేశించారు. నగరంలో పూడికతో నిండిపోయాన నాలాలను శుభ్రం చేయించే పనిలో పడ్డారు. నిజాంపేట భండారి లే అవుట్ ను కూడా ఆయన పరిశీలించారు. వరద నీటిలో చిక్కుకున్న అపార్టుమెంట్ల గురించి ఆరా తీశారు.

స్థానికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు

స్థానికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు

స్థానికుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతకముందు అల్లంతోట బావి, మయూరి మార్గ్ వద్ద నాలాలను పరిశీలించారు. కేటిఆర్ వెంట ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉన్నారు. వెంటనే నాలాలను పూడికతీయించే పనులను చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+