KTR: కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్.. దాడిపై ఆగ్రహం..!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. కొండాపూర్ లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఆయన్ను పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు. కౌశిక్ రెడ్డి ఇంటి దాడి చేయడం దారుణమన్నారు. ఇంట్లో వారి మామగారు ఉన్నారని.. ఆయనకు ఏమైన అయితే బాధ్యులు ఎవరు అని కేటీఆర్ నిలదీశారు. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకుని కండువా కప్పారని అన్నారు.
ఇప్పుడు హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడతున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంతే కండువా కప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు వచ్చి రోజే అరికెపూడి గాంధీకి పీఏసీ పదవి ఇచ్చారుని తెలిపారు. ఇపుడు గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నానని చెబుతున్నారు. ఇదేం పద్దతి అని తమ ఎమ్మెల్యేలు నిలదీశారని పేర్కొన్నారు.

సినిమాల్లో వచ్చినట్లుగా కారు డోర్లకు వేలాడుతూ గూండాలకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి కౌశిక్‌రెడ్డిపై దాడికి పంపారని కేటీఆర్ ఆరోపించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా వారి పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ఇదేం పద్ధతి అని వారు నిలదీస్తున్నారు. హైదరాబాద్ లో ఇమేజ్ డ్యామేజ్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం కామన్ గా మారిపోయిందన్నారు.












Click it and Unblock the Notifications