వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: భయంగా ఉంది చనిపోతున్నా! ...బ్యాచ్ మేట్ కు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఫోన్

భయంగా ఉంది. నేను చనిపోతున్నా...ఆత్మహత్యకు ముందు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన చివరి మాటలివి. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు విచారణ నివేదికను దర్యాప్తు అధికారులు సమర్పించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భయంగా ఉంది. నేను చనిపోతున్నా...ఆత్మహత్యకు ముందు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన చివరి మాటలివి. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు విచారణ నివేదికను దర్యాప్తు అధికారులు సమర్పించారు. ఆత్మహత్యకు ముందు తన బ్యాచ్ మేట్ కు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేశారని కాల్ డేటా ద్వారా విచారణాధికారులు గుర్తించారు.తొందరపాటు నిర్ణయం వద్దని వారించినా ఆయన ఫోన్ కట్ చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసుతో కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు లింకు ఉందని పోలీసులు చెబుతున్నారు.అయితే ఈ విషయమై రెండు కుటుంబాలకు చెందిన వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు చెబుతున్న వాదనలపై సందేహలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందేహాలకు తాము సమాధానాలను చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని పోలీసులు కూడ ప్రకటించారు. బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్యే చేసుకొందని పోలీసులు ప్రకటించారు.

మరోవైపు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి విషయమై ఆయన మృతదేహం పడిఉన్న తీరుపై కూడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. అయితే ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు దర్యాప్తు నివేదికను డిజిపికి సమర్పించారు.

భయంగా ఉంది...ఆత్మహత్య చేసుకొంటా

భయంగా ఉంది...ఆత్మహత్య చేసుకొంటా

భయంగా ఉంది. నేను చనిపోతున్నా...అని ఆత్మహత్య చేసుకొనే ముందు కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన బ్యాచ్ మేట్ తో చివరిగా మాట్లాడినట్టుగా ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆత్మహత్యకు కొద్దినిమిషాల ముందు తన బ్యాచ్ మేట్ కు ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసినట్టుగా కాల్ డేటా ద్వారా గుర్తించారు. ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించారు. తనకు భయంగా ఉందని, ఆత్మహత్య చేసుకోవాలనుకొంటున్నట్టు చెప్పారు. అయితే ప్రభాకర్ రెడ్డిని మరో ఎస్ఐ వారించారని సమాచారం. అయితే వినిపించుకోకుండానే ఆయన ఫోన్ కట్ చేశారని, అయితే క్వార్టర్ లోకి ప్రవేశిస్తున్న సమయంలోనే రివాల్వర్ పేలిన శబ్దం విన్పించిందని ఆయన తెలిపినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

కుటుంబసభ్యుల అనుమానాలు

కుటుంబసభ్యుల అనుమానాలు

అయితే కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనను హత్య చేసి ఉంటారనే అనుమానాలను కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన రోజునుండి కూడ వారంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి మృతదేహం పడి ఉన్న తీరుతో పాటు, ఆయన ఉపయోగించిన ఆయుధం పడిన తీరు ఆయన కుర్చీలో కూర్చొన్న తీరు తదితర అంశాలను ఆయన కుటుంబసభ్యులు ప్రస్తావిస్తున్నారు.

తల వెనుక భాగం నుండి బుల్లెట్ దిగింది

తల వెనుక భాగం నుండి బుల్లెట్ దిగింది

కణతలో కాల్చుకొన్న సమయంలో ప్రభాకర్ రెడ్డి రివాల్వర్ ను కొంత కిందకు వంచి ట్రిగ్గర్ నొక్కాడని, దీంతో బుల్లెట్ తల వెనుకవైపు నుండి బయటకు వచ్చింది. అంతేకాదు తల వెనుక ఉన్న గోడకు తగిలి మరోవైపు మలుపు తీసుకొని పడిపోయిందని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి.తల వెనుక నుండి బుల్లెట్ రావడంతో పెద్దగా రంద్రం ఏర్పడి అటునుండే మాంసం బయటకు వచ్చిందని పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నట్టుగా ఆ కథనం వెల్లడిస్తోంది.

ఫిస్టల్ కాళ్ళ వద్ద ఎందుకు పడిందంటే?

ఫిస్టల్ కాళ్ళ వద్ద ఎందుకు పడిందంటే?

తాను ఉపయోగించిన ఫిస్టల్ ను గట్టిగా పట్టుకొని ఉండడంతో చేతిలోనే ఉండిపోయిందని, చేయి కిందకు వాలిన సమయంలో జారి మడమ వద్ద పడిపోయిందనే నిర్ధారణకు వచ్చారు. కాల్చుకొన్నప్పుడు ఖచ్చితంగా కింద పడిపోవాలని ఏమీలేదన్నారు. కూర్చొనే విధానం, రివాల్వర్ పేలినప్పుడు వచ్చే వేగాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్టు ఆ కథనం వెల్లడిస్తోంది.

English summary
kukunoorpally si Prabhakar reddy phoned his batchmate before suicide . investigation officers found prabhakar reddy calldata information.they were enquire prabhakar reddy batchmate.A telugu media reported a story on Prabhakar reddy suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X