మన కుటుంబ పాలనగా మార్చేశారు, బుద్ధిచెబుతారు: కెసిఆర్‌పై ఎల్ రమణ
హైదరాబాద్: మన పరిపాలన, మన తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. పాలనలో కేవలం మన కుటుంబ పాలనగా చేసి పబ్బం గడుపుకుంటున్నారని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ ధ్వజమెత్తారు. బుధవారం ఎమ్మెల్యే వివేక్ తోపాటు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పాలన పూర్తిగా స్తంభించిందని అన్నారు.
రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వంలో లోపించిందని విమర్వించారు. ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను పరిష్కరించకపోవడం వల్లనే కార్మికులు సమ్మె బాట పట్టారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఉద్యమ న్యాయకుడిగా.. అధికారులు, పాలకుల ఇళ్ల ముందు చెత్తవేయాలని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆలత గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటలను ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు మళ్లీ ఆయనకే అప్పచెబుతున్నారన్నారు.

కెసిఆర్ ఏడాది పాలన అస్తవ్యస్థంగా ఉందని, ఏడాదిలోనే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రమణ విమర్శించారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగర మున్సిపల్ కమిషనర్ అధికారపార్టీ నేతగా వ్యవహరిస్తున్నారని రమణ ఆరోపించారు. ఆయన నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. 66 మంది ఎమ్మెల్యేలు ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ ఐదు ఎమ్మెల్సీలకు ఎలా పోటీ చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ప్రలోభపెట్టి టిఆర్‌ఎస్‌లో చేర్చుకోలేదా? అని రమణ విమర్శించారు.












Click it and Unblock the Notifications