టీడీపీకి ఎల్.రమణ రాజీనామా.. చంద్రబాబుకు షాక్; మూడే వాక్యాలతో రాజీనామా లేఖ !!
తెలుగుదేశం పార్టీకి తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేతకు తన రాజీనామాతో రమణ షాకిచ్చారు. తన రాజీనామా లేఖను శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు రమణ. ఇక రాజీనామా లేఖలో మూడంటే మూడే వాక్యాలతో తాను పార్టీ మారబోతున్నట్లు తేల్చి చెప్పేశారు.

టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన రమణ ..రాజీనామా
తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ రాజీనామాతో తెలుగుదేశం పార్టీ కి భారీ షాక్ తగిలినట్టైంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ తాజాగా ఇంతకాలం పార్టీ కోసం కీలకంగా పనిచేసిన ఎల్. రమణ రాజీనామాతో మరింత ప్రమాదంలో పడింది. ఇక తాను పంపిన రాజీనామా లేఖలో తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరాలని నిర్ణయించుకున్నాను.

టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ... ఇప్పుడు టీఆర్ఎస్ బాట
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నా ఎదుగుదలకు తోడ్పాటునందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎల్ రమణ తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకి పంపించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రమణ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2018 లో ఆయన టిఆర్ఎస్ లో చేరి జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, అప్పట్లో పరిస్థితులు అనుకూలించక ఆయన టిడిపి లోనే ఉండిపోయారు. ఇక ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

రమణతో సీఎం కేసీఆర్ మంతనాలు .. టీఆర్ఎస్ లో చేరేందుకు రమణ సుముఖత
ఇక నిన్న టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఎల్ రమణ మంతనాలు సాగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి ప్రగతి భవన్ కు వెళ్లి కెసిఆర్ ని కలిసిన రమణ గంటకుపైగా చర్చలు జరిపారు. గత ఏడేళ్లలో స్వరాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కెసిఆర్ తో రమణ చర్చించారు. రమణ కు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన టిఆర్ఎస్ లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఈ రోజు తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడు కి పంపించారు.

బీసీల అభ్యున్నతి లో భాగస్వామి కావాలన్న కేసీఆర్ , కేసీఆర్ బాటలో రమణ
గత నెల రోజులుగా రమణ తో సంప్రదింపులు జరుపుతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు రమణ పార్టీలోకి తీసుకురావడానికి చక్రం తిప్పారు సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో, టిఆర్ఎస్ లో చేరి బీసీల అభ్యున్నతి లో భాగస్వామి కావాలని కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రమణ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఇక ఎల్ రమణ తో పాటు మరికొందరు టిడిపి నాయకులు కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications