వివాహిత ఆత్మహత్యకు కారణమైన బెండకాయ

బెండకాయ కూర ఓ వివాహిత ఆత్మహత్యకు కారణమైంది.ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో చేటుచేసుకొంది.

కరీంనగర్: బెండకాయ కూర ఓ వివాహిత ఆత్మహత్యకు కారణమైంది.ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో చేటుచేసుకొంది.

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామికి చెందిన చుక్క సదయ్య విజయ దంపతులు నివసిస్తున్నారు. సదయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

సదయ్య శుక్రవారం నాడు ఉదయం పూట డ్యూటీకి వెళ్ళే సమయంలో భార్య బెండకాయ కూరతో అన్నం వడ్డించింది.అయితే బెండకాయ కూర విషయమై భార్యతో భర్త గొడవపడ్డాడు.

ప్రతిరోజూ బెండకాయ కూరేనా అంటూ ఆయన భార్యతో వాగ్వావాదానికి దిగాడు.అయితే ఈ విషయమై భర్త మందలింపులతో తీవ్ర మనస్థాపానికి చెందిన విజయ ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.

రోజు మాదిరిగానే భర్త, పిల్లలు భవనంపై నిద్రిస్తున్నారు. అయితే ఇంట్లోనే ఉన్న విజయ శుక్రవారం రాత్రి పూట పురుగుల మందుతాగింది.అయితే పురుగుల మందు తాగిన విషయాన్ని తన సోదరులకు తెలిపింది.

అయితే మందు ప్రభావంతో వాంతులు చేసుకోవడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించే సమయంలోనే అక్కడికి చేరుకొన్న విజయ సోదరులు ఆమెను ద్విచక్రవాహనంపై సుల్తానాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడి నుండి కరీంనగర్ కు తరలించారు.

ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున విజయ మరణించింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+