వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్! జగన్‌కు మద్దతుకాదు.. ఇలా చెయ్: మళ్లీ సర్వే చేస్తున్న లగడపాటి, తెలంగాణలో కూడా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలు తారుమారయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకున్న లగడపాటి.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో.. ఇక నుంచి తమ సర్వే వివరాలను ఎన్నికలు పూర్తయ్యాక చెబుతానని ప్రకటించారు. ఇదే విషయాన్ని తాజాగా మంగళవారం మరోసారి చెప్పారు.

రెండేళ్ల కిందటే సీబీఐకి ఈడీ సంచలన లేఖ!: ఎన్నికలకు ముందు జగన్‌కు 'హైదరాబాద్' షాక్రెండేళ్ల కిందటే సీబీఐకి ఈడీ సంచలన లేఖ!: ఎన్నికలకు ముందు జగన్‌కు 'హైదరాబాద్' షాక్

టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయాలి

టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేయాలి

ఏపీలో ఏదో ఒక పార్టీకి మెజార్టీ వస్తుందని, హంగ్ వచ్చే పరిస్థితి లేదని, ఎవరితో అభివృద్ధి జరుగుతుందో ప్రజలు నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ప్రస్తావించారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీలో పేటీ చేస్తే సంతోషమని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి భావసారూప్యత కలిగిన పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే బాగుంటుందన్నారు.

గిఫ్ట్ ఇస్తానంటే ఇలా చేయాలి

గిఫ్ట్ ఇస్తానంటే ఇలా చేయాలి

చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారని, అలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటే నేరుగా పోటీ చేయడమో, ఎవరితోనైనా కలిసి పోటీ చేయడమో ఉండాలని, తెరాస ఏపీకి వచ్చే పోటీ చేస్తే సంతోషిస్తానని, దాని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుందని, ప్రజల మధ్య విభేదాలు తొలగిపోతాయని, అలా కాకుండా ఎవరికో సహకరించడం సరికాదని వ్యాఖ్యానించారు. తెరాస.. జగన్ నేతృత్వంలోని వైసీపీకి మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో లగడపాటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎవరికో మద్దతివ్వడం సరికాదని, మద్దతిచ్చిన వారు గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా ఉంటుందని, ఇలాంటివి ఉండకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతీయ పార్టీలు రెండు రాష్ట్రాల్లో పోటీ చేయాలన్నారు.

సర్వే వివరాలు ఆ తర్వాతే ప్రకటిస్తా

సర్వే వివరాలు ఆ తర్వాతే ప్రకటిస్తా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తాను చేపట్టే సర్వేలకు సంబంధించిన వివరాలను ఎన్నికల తర్వాతే ప్రకటిస్తానని లగడపాటి చెప్పారు. తెలంగాణ, ఏపీ పోలింగ్ పైన కూడా సర్వే చేస్తానని అన్నారు. గత అనుభవం దృష్ట్యా ఈ సర్వే ఫలితాలను మాత్రం ఎన్నికల తర్వాత ప్రకటిస్తారు.

English summary
Former MP Lagadapati Rajagopal said that he will reveal his survey reports after Lok Sabha and Andhra Pradesh assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X