Fake Phone Pay APP: ఫేక్ ఫోన్ పే యాప్.. జాగ్రత్త సుమీ..!
దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. చిన్న కిరాణా షాపు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాళ్లలో కూడా యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు. యూపీఐ లావాదేవీల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఇక యూపీఐ యూప్ ల్లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ ముందున్నాయి. చాలా మంది యూపీఐ పేమెంట్లు వచ్చేయో లేదో తెలుసుకోవడానికి స్పీకర్లు వాడుతుంటారు.
యూపీఐ పేమెంట్ చేయగానే మీరు ఎంత పే చేస్తే అంత అని స్పీకర్ చెబుతుంది. దీంతో డబ్బు వచ్చినట్లు వ్యాపారులు నమ్ముతారు. తాజాగా ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా కొంత మంది లక్షల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్పల్లిలోని మద్యం షాపులే టార్గెట్ గా ఫేక్ ఫోన్ పేను ఉపయోగించారు. లక్షల్లో మద్యం కొనుగోలు చేసి వైన్ షాపు నిర్వాహకులను మోసం చేశారు.

అయితే లావాదేవీల్లో తేడా రావడంతో చేవెళ్లలోని దుర్గా వైన్స్ మేనేజర్ షాపుకు వస్తున్న వారిపై నిఘా పెట్టాడు. మద్యం షాపు వద్ద బిజీగా ఉండే సమయంలో కొందరు వ్యక్తులు ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా లిక్కర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారు ఫోన్ పే చేయగానే.. స్పీకర్ లో డబ్బులు చెల్లించినట్లు సౌండ్ వచ్చింది. కానీ అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ కాలేదు. దీంతో నిందితులను పట్టుకుని పోలీసులు అప్పగించారు.నిందితుల్లో ఓ వ్యక్తి చేవెళ్లకు చెంది వ్యక్తిగా గుర్తించారు.
నిందితుల్లో ఒకరు ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా మద్యం కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. వ్యాపారులు సౌండ్ బాక్స్ సౌండ్ వచ్చిందో చూసుకోవడమే కాదు.. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో కాలేదో చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ సమయంలో ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications