భూకుంభకోణంలో ఇరుక్కున్న కెకె ఫ్యామిలీ: కబ్జా భూమిలో కూతురి పేరిట రిజిస్ట్రేషన్స్!?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ రెవెన్యూ డిపార్ట్ మెంటులో చోటు చేసుకున్న భూ అవకతవకలు ఆఖరికి అధికార పార్టీతోను ముడిపడుతున్నాయి. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుటుంబం సైతం ఇప్పుడీ స్కామ్ లో ఇరుక్కుంది. కుంభకోణం వెనుక ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్టోన్ సంస్థ.. వారి కబ్జా సొత్తులో కేకెకు కూడా భాగస్వామ్యం పెట్టింది.

ఇబ్రహీంపట్నంకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల్లో 38ఎకరాలను ఆయన కుటుంబం పేరిట గోల్డ్ స్టోన్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భూములన్ని దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసినవేనని నిర్దారించారు. కెకె కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కోడలు జ్యోత్న(విప్లవ్‌ కుమార్‌ భార్య), కంచర్ల నవజ్యోతిలకు ఈ భూమిని గోల్‌స్టోన్‌ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం.

దండు మైలారం పంచాయతీ హఫీజ్‌పూర్‌ రెవెన్యూ పరిధిలో ఈ భూములు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉన్న ప్రకారం.. మొత్తం కబ్జా చేసిన భూమి 50ఎకరాలు కాగా అందులో 38ఎకరాలు కెకె కుమార్తె పేరిట ఉన్నట్లు గుర్తించారు. కాగా, కెకె కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ లో కార్పోరేటర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

KK

ఇక్కడి ప్రభుత్వ భూముల్లో చాలాకాలంగా ప్రైవేటు యాజమాన్యాలు జోక్యం చేసుకుంటూ వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది కంపెనీలు ఈ భూమి మాదంటే మాదని ప్రకటించుకున్నాయి. ఇక్కడి భూ రికార్డులను పరిశీలిస్తే..మండలం దండుమైలారం గ్రామంలోని హఫీజ్‌పూర్‌లో 2244.22 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములున్నట్లు తెలుస్తోంది.

ఇందులో 422.29 ఎకరాలను 1965లో ప్రభుత్వం పేదలకు అసైన్‌చేసి పట్టాలు కూడా ఇచ్చింది. మిగిలిన 1821.33 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండగా.. ఇందులో 50ఎకరాలకు ఎసరు పెట్టేందుకు ఐదు కంపెనీలు ప్రయత్నించాయి. ఈ భూమికి తామే హక్కుదారులమని వాదించడం మొదలుపెట్టాయి.

భూకుంభకోణంలో ఇరుక్కున్న కెకె ఫ్యామిలీ: కబ్జా భూమిలో కూతురి పేరిట రిజిస్ట్రేషన్స్!?

ఈ నేపథ్యంలో 2015లో గోల్డ్ స్టోన్ కంపెనీ.. గద్వాల విజయలక్ష్మి(భర్త్త:బాబిరెడ్డి), కంచర్ల నవజ్యోతి (తండ్రి: వెంకటేశ్వర్‌రావు,) జ్యోత్స్న (భర్త: విప్లవ్‌కుమార్‌)లకు ఈ భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేసింది.

అయితే 2015లొ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. చాలాకాలం పాటు అది పెండింగ్ లోనే ఉండిపోయింది. అప్పటిదాకా ఉన్న సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి అక్కడి నుంచి బదిలీ అవడంతో.. ఆయన స్థానంలో ఇన్ చార్జీగా బాధ్యతలు స్వీకరించిన ఖదీర్ ఈ భూములకు రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. గోల్డ్ స్టోన్ కంపెనీకి చెందిన పీవీఎస్ శర్మ ఈ వ్యవహారాన్ని దగ్గరుండి చక్కదిద్దారు.

ఆవిధంగా 2016, మే12న డాక్యుమెంట్‌ నెం.4486/16 ప్రకారం కేశవరావు కుటుంబీకుల పేరిట ఆ భూమి రిజిస్టర్ అయింది. కాగా, మియాపూర్ భూకుంభకోణంలో భాగంగా తీగ లాగిన కొద్ది ఈ డొంకంతా బయటపడింది. గోల్డ్ స్టోన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు వస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS Rajysabha member K.Keshava Rao's family facing allegations of land scam at Ibrahimpatnam. Golden stone company registered 38ecres land on the name of KK's daughter
Please Wait while comments are loading...