జూబ్లీహిల్స్‌ బై పోల్ : నామినేషన్లకు నేడే లాస్ట్ డేట్ !!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగనున్న ఉపఎన్నికల పోరు రాజకీయంగా హీట్ పెంచుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కాగా ఈ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో (అక్టోబర్ 19) ముగియనుంది. ఇప్పటికే మొత్తం 127 నామినేషన్లు దాఖలవగా.. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ రెండో సెట్‌ నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నేడు నామినేషన్‌ వేయనుండగా.. ఆ పార్టీ అగ్రనాయకులు ఆయనతో కలిసి హాజరుకానున్నారు. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనుండగా.. ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 24గా నిర్ణయించారు. అలానే నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది.

last-date-for-nominations-in-jubilee-hills-by-poll-elections

కాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈ ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్.. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ నెలకొననుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల ఆర్ఆర్ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ 36 వేల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయన గతంలో రెండుసార్లు పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. దాంతో ప్రజల్లో సానుభూతి, స్థానికంగా సామాజిక సేవా కార్యక్రమాలు, యువతలో ఫాలోయింగ్ ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్‌ మీద ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణాన్ని సృష్టించిందని నివేదిక పేర్కొంది. అలాగే ఇటీవల కేసీఆర్ తన కూతురు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా అంతర్గత అసంతృప్తికి దారితీసింది.

last-date-for-nominations-in-jubilee-hills-by-poll-elections

బీఆర్ఎస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు..

మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాల తరువాత, బీఆర్ఎస్ ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరాలని అనుకుంటున్నారు. మాగంటి కుటుంబానికి ఉన్న స్థానిక బలం, ఆంధ్ర సెటిలర్లు, కమ్మ కమ్యూనిటీ ఓట్లు సునీతకు బలంగా మారవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేయనుంది. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ పట్టు మరింత బలపడుతుంది. బీఆర్ఎస్ గెలిస్తే అది పార్టీకి పునరుజ్జీవనం అవుతుంది. బీజేపీ బరిలో విజయం సాధిస్తే, మూడో శక్తిగా ఎదగడం సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+