అర్థరాత్రి అకస్మాత్తుగా క్రాకర్స్ మోత.!ఉలిక్కి పడుతున్న చంటి పిల్లలు.!నియంత్రణ ఏదీ.?
హైదరాబాద్ : అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు, చిన్న పిల్లలు సొక్కినోయి పడుకున్నప్పుడు, పగలంతా కష్టపడి రాత్రివేళ సోయి లేకుండా నిద్రలోకి జారుకున్నప్పుడు, అర్దారాత్రి అంతా సర్ధుమణిగి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి కర్ణభేరి పగిలిపోయేంతటి శబ్దంతో, బాణాసంచా మోతలు మొదలైతే చెప్పుకునేది ఎవరికి.?కొన్ని మందల కుటుంబాలకు, కాలనీలకు సమస్యగా పరిణమించిన ఆ అంశాన్ని ఎవరికి మొరపెట్టుకోవాలి.?నిద్రఉన్న చిన్నపిల్లులు ఉలిక్కిపడి, గుక్కతిప్పుకోకుండా రోధిస్తుంటే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి.? ఒక సారి కాదు రెండు సార్లు కాదు.. ఏక ధాటిగా ఇళ్ల మీద అరగంటసేపు భరించలేని ధ్వనులతో బాంబులు కాలుస్తున్న వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి.? అసలు అర్ధరాత్రి కాలుస్తున్న భాణాసంచా పట్ల నియంత్రణ ఉంటుందా.?ఉండదా??

చెవులు పగిలిపోయే ధ్వనులు.. గుండెలు పేలిపోయే బాంబు సౌండ్లు
నగరంలో విష సంస్కృతి బుసకొడుతుందా లేక ఆధునికత పేరుతో విధ్వసం సృష్టిస్తుందా అర్ధం కాని పరిస్ధితులు నెలకొన్నాయి. పుట్టిన రోజు వేడుకలు గతంలో ఒకరోజు ఘనంగా నిర్వహించుకునే సంప్రదాయం ఉండేది. కానీ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం పుట్టిన ముందురోజు అర్ధరాత్రితో పాటు తెల్లవారి రోజంతా జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. సాధారణ స్నేహితులు కూడా రెండు రోజులు జరుపుకుంటున్న జన్మదిన వేడుకలను రాజకీయ నేతలు మాత్రం అత్యంత అట్టహాసంగా నిర్వహించుకుంటున్నారు. అందులో కేక్ కట్ చేయడం, కాక్ టెయిల్ పార్టీలు, డీజేలతో నృత్యాలు వేసుకోవడం వరకూ బాగానే ఉంది. కానీ జన్మదినం సందర్బంగా అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాంబులతో దడపుట్టించడమే అభ్యంతరకరంగా మారింది.

అర్థరాత్రి బాణాసంచా మోత.. ప్రెష్టేజ్ గా భావిస్తున్న యువత
నగరంలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న వ్యక్తుల జన్మదిన వేడుకలకు, పెళ్లీ బారాత్ లకు, ఇతరత్రా వేడుకలకు బాణాసంచా కాల్చడం సర్వసాధారణ అంశంగా మారింది. దాని వల్ల వచ్చే ఆనందం కన్నా అనర్ధాలే ఎక్కువగా ఉన్న సంగతి బాణాసంచా కాలుస్తున్న ఉత్సాహవంతులకు అర్ధం కాదు. సదరు రాజకీయ నేత మెప్పుకోసం ఎంతో భారీగా అర్దరాత్రి బాణాసంచా కాల్చేందుకు ఉత్సహం చూపిస్తుంటారు యువత. అర్థరాత్రి వాళ్లు కాల్చే టపాకాయల వల్ల పర్యావరణానికి, మనుషులకు, వణ్య ప్రాణులకు, పక్షి సంపదకు ఎంత ప్రమాదమో ఏమాత్రం ఖాతరు చేయరు. అన్నింటికి మించి టాపాకాయల వల్ల వచ్చే ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం వల్ల ఎంతటి అనర్థాలు జరుగుతాయోకూడా వారికి తెలియదు.

నిద్రలో ఉలిక్కిపడుతున్న చిన్నారులు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు,ధ్వని కాలుష్యం
అర్థరాత్రి ఆకాశంలో అరగంటకు పైగా అవాయిసువాయిలు కాల్చకపోతే జరిగే నష్టం ఏముందిలే అనే భావన కన్నా, బాణా సంచా కాల్చకపోతే కిక్కెక్కడిది,?అనే ధోరణిలో యువత ముందుకెళ్తోంది. కాలనీ మొత్తం గాఢ నిద్రలో ఉంది ఇప్పుడెందుకు ధ్వని కాలుష్యం అనే ఆలోచనే రాని యువత శాడిస్టుల లాగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకు అర్దరాత్రి బాంబులు కాలుస్తున్నారని అడిగిన వారిని రాజకీయ నేతల అండతో చితక్కొటిన సందర్బాలు కూడా లేకపోలేదు. ఇంత అనర్థాలు జరుగుతున్నా అర్థరాత్రి బాణాసంచా కాల్చే విధానంపై పోలీసుల నిఘా గానీ, నియంత్రణ గానీ లేదా.?అర్ధరాత్రి బాణాసంచా కాల్చే అంశం పై పోలీసు ఉన్నతాదికారులు కార్యాచరణ రూపొందించాలనే వాదన బలంగా వినిపిస్తోంది.

పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి.. నియంత్రించాలంటున్న కాలనీ వాసులు
లక్నో వంటి నగరంలో ధ్వని కాలుష్యనికి కారణమయ్యే బహిరంగ మైకులకు గానీ, సమయం సందర్బం లేకుండా బాణాసంచా కాల్చడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేదించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కు పాదం మోపుతోంది యూపి ప్రభుత్వం. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఈ విధంగా పోలీసు ఉన్నతాదికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయలకపోతున్నారో అర్థం కావడం లేదు. మానవాళికే కాకుండా పర్యావరణానికి, పక్షి సంపదకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న బాణాసంచా కాల్చడంపై నియంత్రణ ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాణాసంచా కాల్చడంపై పూర్తి స్థాయిలో నిషేదాగ్నలు అమలు చేస్తే మరింత మేలు జరుగుతందనే చర్చ జరుగుతోంది. మరి పోలీసు ఉన్నతాదికారులు ఈ అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications