వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగ్విజయ్ ఆశ్చర్యపోయారు: ప్రభుత్వాసుపత్రులపై లక్ష్మారెడ్డి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలంగాణ వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలంగాణ వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పారు. జిల్లా ఆస్పత్రుల్లో కూడా మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని వివరించారు.

శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం చెప్పారు. ప్రజల ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో ఐసీయూ వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ఐసీయూ ఏర్పాటు చేశామని చెప్పారు.

Laxma reddy on government hospitals

దిగ్విజయ్ ఆశ్చర్యపోయారు

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కాంగ్రెస్ నేత చికిత్స పొందారని.. ఆ నేతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆస్పత్రిలో పరామర్శించారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను చూసి దిగ్విజయ్ సింగ్ ఆశ్చర్యపోయారని అన్నారు. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత మెరుగైన సౌకర్యలుండటం పట్ల ఆయన మెచ్చుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన కథనాలు స్థానిక పత్రికల్లో కూడా వచ్చిందని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత చికిత్స జరిగింది ఆ నేతను దిగ్విజయ్ సింగ్ పరామర్శించారు ఆ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంత మంచి సౌకర్యాలున్నాయని ఆయన మెచ్చుకున్నారు. నల్గొండలో ఆస్పత్రుల దుస్థితికి గత ప్రభుత్వాలే కారణమని అన్నారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో 20శాతం లోకల్ పత్రికల్లో కూడా వచ్చాయి.

డీకే అరుణ, సంపత్ చెప్పినట్లుగా కర్నూలు జిల్లాలోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే మన తెలంగాణ ప్రజల బిల్లులను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. అలంపూర్ ప్రాంతంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ లో కూడా 100 పడకల ఆస్పత్రి, బీబీనగర్ ఆస్పత్రిలో ఐపీ సెంటర్, ట్రామా కేర్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు కూడా జరుగుతున్నాయిన తెలిపారు. ఆరోగ్య శ్రీ కోసం 460 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

English summary
Telangana minister Laxma reddy responded on government hospital's problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X