ఈ నెల 23న రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే..?

ఈ నెల 23న తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలు బంద్ కానున్నాయి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మూతబడనున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్‌ నకు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

జులై 23 న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మూతబడనున్నాయి. ఆ రోజు బంద్ పాటించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని సైతం డిమాండ్ చేస్తున్నారు.

ఈక్రమంలో ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జులై 15వ తేదీ మంగళవారం బంద్ పోస్టర్‌ ను హిమాయత్ నగర్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు. బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థి సంఘాల డిమాండ్స్ ఈ విధంగా ఉన్నాయి..

ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.

విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి.

ఖాళీగా ఉన్న టీచర్,MEO,DEO పోస్టులను భర్తీ చెయ్యాలి.

ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి.

పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి.

అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలి.

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలి.

విద్యార్థులకు RTC లో ఉచిత బస్ పాస్‌లు ఇవ్వాలి.

NEP 2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి.

Left-Wing Student Unions Call for Telangana School Shutdown on August 23

ఈ సమావేశంలో AISF రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ , SFI రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు సహా పలువురు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+