వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్‌ను మించిన పాలసీ: సిఐఐలో కెసిఆర్, పారిశ్రామికవేత్తల ప్రశంస(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగపూర్ కంటే తెలంగాణ పారిశ్రామిక విధానమే అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో మూడువేల నుంచి నాలుగు వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు సొంతంగా టౌన్‌షిప్పులను నిర్మించుకునేందుకు వీలుగా భూములను కేటాయిస్తామని తెలిపారు.

బుధవారం రాత్రి హైదరాబాద్‌లో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలి ప్రతినిధులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని.. అవినీతికి తావులేకుండా అతి తక్కువ సమయంలో అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. సాగునీటి ప్ర చట్టాలుండాలని అభిప్రాయపడ్డారు.

కార్మిక సంఘాలు అపసవ్య దిశలో నడుస్తున్నాయని (ఎరాటిక్‌ ట్రేడ్‌యూనియనిజం) విమర్శించారు. సిఐఐ జాతీయ అధ్యక్షుడు సుమిత్‌ మజుందార్‌ అధ్యక్షతన జరిగిన ముఖాముఖిలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, నౌషాద్‌ ఫొర్బీస్‌, వనితా దాట్ల, శోభనాకామినేని, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సీఎం తమ విధానాలను వెల్లడించారు.

వినయ్:
కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం తెలంగాణలో భూ కేటాయింపులుంటాయా? కేంద్ర చట్టం వచ్చిన తరువాత తెలంగాణకు ప్రత్యేక చట్టం రూపొందిస్తారా?
కేసీఆర్:
రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా చట్టాలు ఉండటం ఫెడరల్ వ్యవస్థకు మంచింది. దీనిపై ఇప్పటికే కేంద్రానికి స్పష్టత ఇచ్చాం. భూసేకరణ బిల్లులో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరాం. అదే తరహాలో కేంద్రం నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నాం.

రాజేశ్వరి:
చక్కెర పరిశ్రమ చాలా సంక్షోభంలో ఉంది. తెలంగాణలో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను ఆదుకోవాలి. పీడీఎస్ కోటా చక్కెరను తెలంగాణ మిల్లులనుంచే కొనుగోలుచేస్తే రైతులు బాగుపడతారు. ఇందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి?
కేసీఆర్:
అన్ని అంశాలు సంబంధిత శాఖలో పరిశీలనలో ఉన్నాయి. కొన్ని అంశాలు నావద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అన్నీ పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటాం.

ప్రమోద్ చౌదరి:
బయో ఎనర్జీ పాలసీపై ప్రభుత్వ విధానమేంటి?
కేసీఆర్:
రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఆ సమస్యను అధిగమిస్తున్నాం. 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. 2019నాటికి రూ.91వేలకోట్ల పెట్టుబడులతో 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 12వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. ఇందులో 8వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం కాంట్రాక్ట్‌ను బీహెచ్‌ఈఎల్ సంస్థకు అప్పగించాం. 4వేల మెగావాట్ల విద్యుత్ ఎన్టీపీసీనుంచి వస్తుంది. ఈ మేరకు ఎన్టీపీసీతో మీటింగ్ కూడా అయింది. సోలార్ విద్యుత్ విషయంలోనూ చర్యలు ప్రారంభించాం. 2వేల మెగావాట్లకు బిడ్లు పిలిస్తే 6వేల మెగావాట్లకు వచ్చాయి. బయో విద్యుత్ ఉత్పత్తి గతంలో చేపట్టినా అది విఫలమైంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించినప్పుడు బయో ఎనర్జీపై ఆలోచిస్తాం.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సింగపూర్ కంటే తెలంగాణ పారిశ్రామిక విధానమే అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

రాష్ట్రంలో మూడువేల నుంచి నాలుగు వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు సొంతంగా టౌన్‌షిప్పులను నిర్మించుకునేందుకు వీలుగా భూములను కేటాయిస్తామని తెలిపారు.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

బుధవారం రాత్రి హైదరాబాద్‌లో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ మండలి ప్రతినిధులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాల్గొన్నారు.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

పారిశ్రామికవేత్తల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని.. అవినీతికి తావులేకుండా అతి తక్కువ సమయంలో అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. సాగునీటి ప్ర చట్టాలుండాలని అభిప్రాయపడ్డారు.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

కార్మిక సంఘాలు అపసవ్య దిశలో నడుస్తున్నాయని (ఎరాటిక్‌ ట్రేడ్‌యూనియనిజం) విమర్శించారు.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిఐఐ జాతీయ అధ్యక్షుడు సుమిత్‌ మజుందార్‌ అధ్యక్షతన జరిగిన ముఖాముఖిలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, నౌషాద్‌ ఫొర్బీస్‌, వనితా దాట్ల, శోభనాకామినేని, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సీఎం తమ విధానాలను వెల్లడించారు.

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

సిసిఐ ముఖాముఖిలో కెసిఆర్

పారిశ్రామికవేత్తల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని.. అవినీతికి తావులేకుండా అతి తక్కువ సమయంలో అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. సాగునీటి ప్ర చట్టాలుండాలని అభిప్రాయపడ్డారు.

నీల్హ్రేజా:
విద్యుత్ వినియోగంలో స్వేచ్ఛనిస్తే ఐటీ కంపెనీలకు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. అదే విధంగా రాష్ట్రంలో హోటళ్లలో అత్యధిక పన్నుల విధానం ఉంది. టూరిజాన్ని ప్రమోట్ చేస్తే ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది..
కేసీఆర్:
హెచ్‌ఎండీఏ పరిధి 7200 చదరపు కిలోమీటర్లు ఉంది. ప్రణాళిక సరిగ్గా లేదు. జోన్ల విభజన సరిగ్గా జరగలేదు. ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీకి అప్పగించాం. అవినీతి ఆరోపణలపై కొందరు అధికారులను సైతం తొలగించాం. మొత్తం హెచ్‌ఎండీఏ పరిధిలో కొత్త జోన్ల విభజనపై పునరాలోచిస్తున్నాం. మొత్తం జోనింగ్ వ్యవస్థను ఎలా రూపొందించాలన్న దానిపై ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీకి బాధ్యత అప్పగించాం. ఇక విద్యుత్ విషయానికొస్తే.. ఎనర్జీ రెగ్యులేటరీ కార్పొరేషన్ దగ్గర జెన్‌కో రూ.16వేల కోట్ల రుణాన్ని తీసుకుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం.

పవన్ గోయెంకా:
తెలంగాణలో మహీంద్రాకు అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. పదేండ్లుగా ఇక్కడ కొనసాగిస్తున్నాం. ఉమ్మడి ఏపీకంటే కూడా తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎంతో బాగుంది. ఆసియాలోనే రెండవ అతిపెద్ద ట్రాక్టర్ ప్లాంటు ఇక్కడ ఉంది. మా ప్లాంటు విస్తరణకు ప్రభుత్వంనుంచి నిరంతరాయంగా ప్రోత్సాహం అందుతున్నది.
కేసీఆర్:
జీహెచ్‌ఎంసీ ఇప్పటికే మీకు రెండు వేల జీతో మినీ ట్రక్కులు ఆర్డర్ ఇచ్చింది.

అరుణ్‌భరత్‌రావు:
సింగిల్ విండో విధానంతో ఇస్తున్న పరిశ్రమల అనుమతుల ప్రక్రియ మున్ముందు కొనసాగుతుందా? ఇప్పటికిప్పుడు అనుమతించిన వాటికి భవిష్యత్తులో ఏమైనా ఆటంకాలు వస్తాయా?
కేసీఆర్:
తెలంగాణలో అద్భుతమైన వాతావరణం ఉన్నది. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో అవినీతికి తావులేదు. టీఎస్ ఐపాస్‌లో భాగంగా తొలివిడతలో 17 పరిశ్రమలకు కేవలం 11 రోజుల్లోనే అనుమతులిచ్చాం. రెండో విడతలో 19 కంపెనీలకు 12 రోజుల్లో అనుమతులిచ్చాం. త్వరలో ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇంక్యుబేట్, ఇన్నోవేట్, ఇన్‌కార్పొరేట్ విధానంతో పనిచేస్తున్నాం.

పారిశ్రామికవేత్తలు నిర్ణీత సమయంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే హక్కు కల్పించాం. పరిశ్రమల కోసం వాటర్ గ్రిడ్‌లో 10శాతం నీటిని కేటాయించాం. టీఎస్ ఐపాస్ కోసం సింగపూర్ ఇండస్ట్రీయల్ పాలసీని అధ్యయనం చేశాం. సింగపూర్ పాలసీకంటే తెలంగాణ పాలసీ ఎంతో అద్భుతంగా ఉన్నది. ఐటీ పరిశ్రమలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. శాటిలైట్, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణంకోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

గోద్రేజ్:
తెలంగాణలో గ్రీన్ టౌన్‌షిప్స్ ఏర్పాటు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మిగతా విద్యుత్‌తో పోల్చినప్పుడు సోలార్ విద్యుత్ ప్లాంటు తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయవచ్చు కదా? సింగపూర్, వియత్నాంల పాలసీ కంటే టీఎస్ ఐపాస్ మంచిదా?
కేసీఆర్:
గ్రీన్ టౌన్‌షిప్స్ ఏర్పాటును త్వరలో ప్రోత్సహిస్తాం. సింగపూర్, వియత్నాంలకంటే టీఎస్ ఐపాస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను కూడా సింగపూర్ పారిశ్రామిక ప్రాంతాన్ని చూసి వచ్చాను. పరిశ్రమల అనుమతులు అక్కడి కంటే ఇక్కడే వేగంగా వస్తున్నాయి. ఇక్కడ అవినీతి లేదు. జీరో పర్సెంట్. కరప్షన్ ఫ్రీ, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఒక్క అప్లికేషన్ ఇస్తే చాలు అనుమతులు వస్తాయి. ప్రభుత్వ సహకారం బ్రహ్మాండంగా ఉంది.

దేవసాని(ఎల్‌అండ్‌టీ):
హైదరాబాద్‌లో నాలుగైదు ఏండ్లనుంచి రూ.16 వేల కోట్లతో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం. ప్రాజెక్టు బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నది. పనుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చాలా బాగుంది. తెలంగాణ ప్రభుత్వం చాలా విశ్వాసం ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నది. ట్రాఫిక్ అధికారులు బాగా సహకరిస్తున్నారు.

వనిత దాట్ల:
గత ఏడాది కాలంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. పెట్టుబడిదారుడికి పెట్టుబడి పెట్టుకునే హక్కు ఇవ్వడం కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతున్నది. త్వరలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశానికే గర్వకారణంగా నిలుస్తుంది.

శోభన కామినేని:
తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గర్విస్తున్నాను. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం బ్రహ్మాండంగా ఉంది.

శివకుమార్:
పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయం అత్యంత ప్రధానమైనది. వ్యవసాయానికి, ఫుడ్ ప్రాసెసింగ్‌కు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటి?
కేసీఆర్:
తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. ఏపీలో తెలంగాణ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. నిధులు, నీళ్లు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తోనే ఆందోళనలు, ఉద్యమం జరిగాయి. నీటి వనరుల కేటాయింపులో తెలంగాణ పూర్తిగా విస్మరణకు గురైంది. ఉమ్మడిరాష్ట్రంలో ప్రాజెక్టులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. రైతుల పొలాలకు నీళ్లు అందలేదు. కొత్త రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి మా దగ్గర ఎన్నో ప్రణాళికలున్నాయి. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చడమే మా లక్ష్యం.

ఇక్కడ రకరకాల భూములున్నాయి. 900 నుంచి 1100 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం ఉంది. మంచి వాతావరణ అనుకూలతలున్నాయి. ఇవన్నీ కూడా విత్తనోత్పత్తికి సహకరిస్తాయి. ఇది నేను చెప్తున్నది కాదు. శాస్త్రవేత్తలు చెప్తున్న వాస్తవం. తెలంగాణలో ఇప్పటికే 542 సీడ్ కంపెనీలు ఉన్నాయి.

హైదరాబాద్ పరిసరాల్లో వంద కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌హౌస్, పాలిహౌస్ కల్టివేషన్‌ను ప్రోత్సహించాలని ఇటీవలే నిర్ణయించాం. ప్రత్యేకించి కూరగాయల సాగుకు వాతావరణం అనుకూలం. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన రోజే ఐటీసీ దేవేశ్వర్ రూ.8000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అన్ని అనుమతులను వీలైనంత తక్కువ సమయంలో ఐటీసీకి ఇచ్చాం.

గత ఏడాది గ్రీన్‌హౌస్ కల్టివేషన్ కోసం రూ.500 కోట్లు కేటాయించాం. గ్రీన్‌హౌస్ కల్టివేషన్‌లో లాభాలేమిటో ఒక రైతుగా నాకు బాగా తెలుసు. మూడునాలుగేండ్లలో ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ మంచి వ్యవసాయ రాష్ట్రం అవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌ను సైతం ప్రోత్సహిస్తున్నాం. తూప్రాన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ఐటీసీ కంపెనీకి అన్ని అనుమతులు ఇచ్చాం. దేశంలోనే అత్యుత్తమమైన హిమాయత్ పసంద్ మామిడి తెలంగాణ ప్రత్యేకత. రైతులు ఈ రకం మామిడిని పెంచేలా ప్రోత్సహిస్తున్నాం.

అజిత్ గులాబ్‌చంద్:
హైదరాబాద్ మౌలికవసతుల కల్పనలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ఎంతవరకు తీసుకుంటున్నారు? రాష్ట్ర మౌలిక వసతుల కల్పన విధానం ఏవిధంగా ఉండనుంది? నగరంలో ట్రాఫిక్ సమస్య ఎప్పటికి తీరుతుంది?
కేసీఆర్:
హెచ్‌ఎండీఏ పరిధి 7200 చదరపు కిలోమీటర్లు. ట్రాఫిక్ సమస్యనుంచి హైదరాబాద్ బయటపడాలి. హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనలో ప్రైవేట్‌సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌లోడల్లాస్ తరహాలో మల్టీలెవెల్ ైఫ్లెవోవర్లను జీహెచ్‌ఎంసీ నిర్మించనుంది. రూ.21వేల కోట్లతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయబోతున్నాం. రూ.4వేల కోట్లతో తొలిదశ పనులకు టెండర్లు పిలిచాం. పెద్ద కంపెనీలు వస్తాయనే ఆకాంక్ష ఉంది. పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తున్నాం. అందుకు అనుగుణంగా టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. క్రెడాయ్‌లాంటి సంస్థలతోనూ మాట్లాడతామని సిఎం కెసిఆర్ చెప్పారు.

English summary
At a time when the Union government is struggling to break the logjam and facing stiff resistance from the opposition over the contentious land bill, Chief Minister K Chandrasekhar Rao has appealed to the Centre to give states a free hand to follow their own land laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X