Weather Update: ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఎక్కడంటే..!
హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడాని తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక హైదరాబాద్ లో కూడా గాలులు, మెరుపులు, ఉరుపులతో కూడాని జల్లులు లేదా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం సాయంత్రం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన పడింది.
ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, బేగంబజార్, నార్సింగి, మణికొండ, గండిపేట, బండ్లగూడ, అత్తాపూర్ వర్షం కురిసింది. బాచుపల్లి, మియాపూ, కుత్బుల్లాపూర్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కోఠిలో వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరింది. అలాగే పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్స్ క్లియర్ చేసింది. సోమవారం సాయంత్రం లేదా రాత్రి కూడా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆదివారం తెలంగాణలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అత్యధికంగా 3.5 సెంటీమీటర్ వర్షపాతం నమోదు అయింది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించారు. జూన్ 1న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు క్రమంగా దేశంలోకి విస్తరించాయి.
తెలంగాణ విషయానికి వస్తే ఈసారి నైరుతి రుతుపవనాలతో వల్ల మంచి వర్షాలే కురిశాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండాయి. జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలం, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు నిండాయి. అటు ఏపీలోను ఈసారి భారీ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications