లింబయ్యకు రూపాయి అప్పు లేదు, 8 ఏళ్లుగా ప్రాణాంతక వ్యాధి: పోచారం అదే మాట

హైదరాబాద్: నిజామాబాద్ రైతు లింబయ్య ఆత్మహత్యపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కూడా అదే మాట మాట్లాడారు. హైదరాబాదులోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఆత్మహత్య చేసుకున్న లింబయ్యకు ఒక్క రూపాయి అప్పు కూడా లేదని ఆయన తెలిపారు. లింబయ్య గత ఎనిమిదేళ్లుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు తేలిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. లింబయ్య వ్యవసాయం చేయడం లేదని, తన భూమిని కౌలుకు ఇచ్చాడని కూడా మంత్రి చెప్పారు.

రైతు యూనిట్‌గా పంటల బీమాను అమలు చేసినప్పుడే ఆత్మహత్యలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు ధరల స్థిరీకరణ చేయాలని ఆయన అన్నారు. గత ఏడాదిన్నర కాలంలో 490 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా 20 శాతం తక్కువగా ఉందని చెప్పారు.

pocharam srinivas reddy

రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి స్పష్టం చేశారు. మొన్నటి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీపై స్పష్టతనిచ్చామన్నారు. రుణమాఫీ మొదట్లో ఇబ్బందులు ఉండేవని ఇప్పుడవి తొలగిపోయాయని అన్నారు. రూ.21.70 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశామన్నారు.

రాష్ట్రంలో ఈసారి 41 లక్షల 43 హెక్టార్లలో పంటలు వేశారని వెల్లడించారు. 5 లక్షల 68 వేల హెక్టార్లలో వరినాట్లు వేశారని తెలిపారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో పంటలు నష్టపోలేదని వివరించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. జులైలో అతి తక్కువ వర్షపాతం నమోదైన కొన్ని జిల్లాల్లో పంటకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాకు అధిక నష్టం సంభవించిందన్నారు. ప్రత్యామ్నయ పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు. రైతులు కోరిన వెంటనే రాయితీపై విత్తనాలు అందిస్తామని తెలిపారు. సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+