ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రోలో ఇకపై కొత్త సేవలు..

హైదరాబాద్ మెట్రోలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. రోడ్లపై ట్రాఫిక్ దృష్ట్యా తమ గమ్య స్థానాలకు వేగంగా చేరుకోవడానికి విద్యార్థులు, ఉద్యోగులు మెట్రోనే ఆశ్రయిస్తుంటారు. ఆటోలు, క్యాబ్ తో పోల్చితే మెట్రో టికెట్ ధరలు తక్కువగానే ఉండటంతో చాలామంది మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మెట్రోలో ప్రయాణం చాలా సురక్షితం, సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే తాజాగా ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు లగేజ్ ను మెట్రోలో తీసుకుని వెళ్లి ఇబ్బంది పడకుండా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ లగేజీ, పెద్ద పెద్ద బ్యాగులు, బ్యాక్‌ ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్​ మహానగరంలో మెట్రో సేవలను ప్రయాణికులు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ట్రాఫిక్ కారణంగా మెట్రోలో వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మెట్రోలో ప్రయాణం సౌకర్వవంతంగా భావిస్తున్నారు. అటు మెట్రో యాజమాన్యం సైతం ప్రయాణికుల ఆసక్తి, అభిరుచులు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ముందుకెళ్తోంది. అయితే తాజాగా మెట్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో స్టేషన్లలో స్మార్ట్​ లాకర్ల సదుపాయం.. అనే సరికొత్త ఫీచర్​ ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు L అండ్​ T మెట్రో రైల్​ లిమిటెడ్​, టక్కీట్​ భాగస్వామ్యంతో హైదరాబాద్​ నగరంలోని 7 మెట్రో స్టేషన్లలో ఆన్​- డిమాండ్​ స్మార్ట్​ స్టోరేజ్​ లాకర్ల సౌకర్యాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇక ప్రస్తుతం మియాపూర్, అమీర్‌ పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్‌, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్స్, హై- టెక్ సిటీ స్టేషన్లలో స్మార్ట్​ స్టోరేజ్​ లాకర్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది L అండ్​ T మెట్రో రైల్​ లిమిటెడ్ సంస్థ. స్మార్ట్ లాక్ సిస్టమ్ లో భాగంగా.. ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ ప్యాక్‌ లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగపడతాయని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://www.tuckit.in/ వెబ్ సైట్ ను సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొంది.

Lock Ride Unlock Smart Lockers at Hyderabad Metro

మరోవైపు హైదరాబాద్​ మెట్రో ప్రారంభం అయి నవంబర్ 28 శుక్రవారంతో 8 ఏళ్లు పూర్తి అయ్యాయి. 2017 నవంబరు 28న మియాపూర్​ లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మియాపూర్​ నుంచి నాగోల్​ వరకు మెట్రో రైలు సేవలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం 69 కి. మీ. వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక మెట్రో రైళ్లతో ప్రతిరోజూ సగటున 4-5 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు. 57 మెట్రో రైళ్లు నిత్యం 1100 ట్రిప్పులతో పాతికవేల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+