• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక తగ్గేది లే.!లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం.!కరోనా కట్టడికి తప్పదంటున్న పోలీసులు.!

|

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో దాని కట్టడి కోసం ప్రభుత్వం మొదట రాత్రి వేళ కర్య్పూను అమలు చేసింది. రాత్రి కర్య్పూ ద్వారా కరోనా ఉదృతి అంతగా తగ్గకపోడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది. కరోనా రెండవ దశను నియంత్రించేంత వరకూ ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా చేరకూడదనే నిబంధనలను అమల్లోకి తెచ్చింది తెలంగాణ సర్కార్. కాగా లాక్‌డౌన్ ఆంక్షలను నగర ప్రజలు అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పోలీసులకు ఏదో ఒక కారణం చెప్తూ రోడ్ల మీద యధేచ్చగా తిరుగుతున్న దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి.

అకారణంగా బయటకు వస్తే అంతే సంగతులు.. లాఠీలు ఝళిపించనున్న పోలీసులు..

అకారణంగా బయటకు వస్తే అంతే సంగతులు.. లాఠీలు ఝళిపించనున్న పోలీసులు..

ఇదిలా ఉండగా ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా జరుపుకునే పవిత్ర రంజాన్ పర్వదినం సందర్బంగా లాక్‌డౌన్ ఆంక్షల అమలు అంశంలో పోలీసులు కాస్త ఉదాసీనంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. రంజాన్ పర్వదినం ముగిసింది కాబట్టి యదేఛ్చగా రోడ్ల పై సంచరించే వారి పట్ల పోలసులు కఠినంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. ఏ కారణం లేకుండా రోడ్ల మీదకు వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు పోలీసు ఉన్నతాదికారుల నుండి వెలువడుతున్నయి.

కఠిన ఆంక్షలు తప్పవు.. ప్రజలు సహకరించకపోతే కరోనా కట్టడి సాద్యం కాదంటున్న పోలీసులు..

కఠిన ఆంక్షలు తప్పవు.. ప్రజలు సహకరించకపోతే కరోనా కట్టడి సాద్యం కాదంటున్న పోలీసులు..

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలను ప్రజలందరూ ఆచరించకపోతే పెను ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ ఉదృతి తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. సాద్యమైనంత తొందరగా యాంటీ కరోనా వ్యాక్సీన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాలు విశ్వ ప్రయాత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా దేశవాలీ వ్యాక్సీన్ మాత్రమే కాకుండా రష్యా నుండి స్పుత్నిక్ వంటి వ్యాక్సీన్ ను దిగుమతి చేసుకుంటోంది.

బయటకు వచ్చి ఏదో కారణం చెప్తే ఎలా..? కొన్ని రోజులు స్వీయ నియంత్రణ పాటించాలంటున్న కాఖీలు..

బయటకు వచ్చి ఏదో కారణం చెప్తే ఎలా..? కొన్ని రోజులు స్వీయ నియంత్రణ పాటించాలంటున్న కాఖీలు..

ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం ఇంత చేస్తున్నా ప్రజలు సహకరించకపోతే మొత్తం ప్రయత్నాలు మొదటికే వస్తాయనే చర్చ జరుగుతోంది. మాస్కులు ధరించడం, స్వీయ నియంత్రణ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం, హోం ఐసోలేషన్ లో ఉండడం వంటి సాధారణ నిబంధనలు పాటించకపోతే ఎలా ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పోలీసుల చేత ఆంక్షలను కఠినంగా అమలు చేయిస్తే కరోనా తరిమికొట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నిన్నటి వరకు ఒక లెక్క రేపటినుండి ఒక లెక్క అనే రీతిలో పోలీసులు వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.

లాక్‌డౌన్ ఆంక్షల పట్ల అవగాహన పెంచుకోవాలి.. సహనానికి పరీక్ష పెట్టొద్దని హెచ్చరిస్తున్న పోలీసులు..

లాక్‌డౌన్ ఆంక్షల పట్ల అవగాహన పెంచుకోవాలి.. సహనానికి పరీక్ష పెట్టొద్దని హెచ్చరిస్తున్న పోలీసులు..

కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న లాక్‌డౌన్ ఆంక్షలను కొంతమంది భేఖాతరు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం 10గంటల నుండి ఆంక్షలు అమలులో ఉండగా 11, మద్యాహ్నం 12గంటలు ఆతర్వాత కూడా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న దృశ్యాలు అనేకం కనిపించాయి. కాగా అన్ని పర్వదినాలు ముగిసాయి కాబట్టి ఇక పోలీసులు తమ ప్రతాపం చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చి ఏదో ఒకటి బుకాయించి పోలీసులను బకరా చేసి ఉడాయించే బ్యాచ్ తాట తీసేందుకు లాఠీలకు పనిచెప్పబోతున్నారు పోలీసులు. కరోనా కరాళ నృత్యాన్ని నిలువరించాలంటే, ఆంక్షల పట్ల భయం లేకుండా బలాదూర్ గా తిరిగే బడుద్దాయిలకు బడితపూజ తప్పదంటున్నారు పోలీసు ఉన్నతాదికారులు.

  Ambulances At Borders నిలిపివేత ఆదేశాలపై TS HC Stay రాజ్యాంగాన్ని మార్చేస్తారా? | Oneindia Telugu
  English summary
  Lockdown restrictions do not following by the city people. There are a number of scenes appearing from the public that random roaming on the roads telling the police for some silly reason.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X