తెలంగాణలో ఆ పార్టీదే అధికారం: లేటెస్ట్ సర్వే రిపోర్ట్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

Lok Poll has predicts Congress is expected to come power in Telangana

ఇక్కడ త్రిముఖ పోరు నెలకొని ఉంది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ రాష్ట్ర సమితి కసరత్తు పూర్తి చేసింది. జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోంది. హ్యాట్రిక్ కొట్టాలనే సంకల్పంతో ఉందా పార్టీ. బీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో పలు ఎన్నికల సర్వే సంస్థలు తమ ఒపీనియన్ పోల్స్ బయటపెడుతున్నాయి. తమ అంచనాలను వెల్లడిస్తూ వస్తోన్నాయి. ప్రజల నాడి ఎలా ఉందనేది స్పష్టం చేస్తోన్నాయి. తెలంగాణ సహా ఎన్నికలను ఎదుర్కొంటోన్న మిగిలిన నాలుగు రాష్ట్రాల ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పటికే కొన్ని జాతీయ మీడియా సంస్థలు సైతం వ్యక్త పరిచాయి.

ఈ క్రమంలో లోక్ పోల్ సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాభిప్రాయాలతో రూపొందించిన రిపోర్ట్ అది. మొత్తంగా 37,500 మంది అభిప్రాయాలను సేకరించింది. ఇందులో పురుషులు, మహిళలు, ఓటు హక్కు ఉన్న యువకులు, వయోధిక వృద్ధులు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలూ ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 58 నుంచి 64 సీట్లు లభిస్తాయని పేర్కొంది. 41 నుంచి 44 శాతం వరకు ఓట్లు పడొచ్చని తెలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫీగర్ కంటే స్వల్ప ఆధిక్యతతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది.

గతంలోనూ ఈ సంస్థ ఓ ఒపీనియన్ పోల్ విడుదల చేసింది. అప్పట్లో కాంగ్రెస్‌కు 61 నుంచి 67 స్థానాలు దక్కుతాయని తెలిపింది. అభ్యర్థుల జాబితా వెలువడిన తరువాత కాంగ్రెస్‌కు లభించబోయే సీట్ల సంఖ్యను తగ్గించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభ్యర్థుల జాబితా వెలువడిన తరువత చేసిన సర్వే ఇది.

అధికార బీఆర్ఎస్ ఈ సారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలిపింది లోక్ పోల్ సర్వే సంస్థ. ఆ పార్టీకి 47 నుంచి 53 స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది. 39 నుంచి 42 శాతం ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు 5 నుంచి 7 సీట్లు దక్కుతాయి.

ఈ నివేదిక ఆధారంగా చూస్తే- బీజేపీ పరిస్థితిలో పెద్దగా ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చనేది స్పష్టమౌతోంది. బీజేపీ 2 నుంచి 3 స్థానాలకే పరిమితం కావొచ్చు. 9 నుంచి 12 శాతం మాత్రమే ఓట్లు పోల్ అవుతాయి. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు లోక్ పోల్ సర్వే అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+