తెలంగాణలో మహిళా ఓటర్లే ఎక్కువ: 31 లక్షల ఓటర్లు ఉన్న అతిపెద్ద లోక్‌సభ సీటు అదే

Lok Sabha election 2024 in Telangana: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ.. అన్ని పార్టీలు కూడా కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల రణరంగంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

Lok Sabha elections 2024 Telangana have more women voters

కాంగ్రెస్ చేతిలో ఉన్న ముడుకు మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ 17 లోక్‌సభ స్థానాల కోసం మే 13వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న మొత్తం ఓటర్ల వివరాలు విడుదల అయ్యాయి. ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. వీటిని విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య, అందులో పురుష ఓటర్లు, మహిళ ఓటర్ల సంఖ్య, పోలింగ్ బూత్, ఎన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరమౌతాయి?.. వంటి వివరాలు ఇందులో ఉన్నాయి.

దీని ప్రకారం చూసుకుంటే- తెలంగాణలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 3,30,00,088. ఇందులో పురుష ఓటర్లు 1,64,10,227 మంది ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 1,65,87,134. జెండర్ రేషియో 1,011గా నమోదైంది. అంటే ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 1,011 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ల ఓట్ల సంఖ్య 2,727.

85 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు 1,94,082 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారందరూ ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం ఉంది. 3,403 మంది ఎన్నారై, 5,26,340 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 8,67,717 మంది. ఇందులో పురుషులు- 4,82,688, మహిళలు- 3,84,932, ట్రాన్స్‌జెండర్లు- 97 మంది. ఈవీఎంలల్లో బ్యాలెటింగ్ యూనిట్లు- 57,048, కంట్రోలింగ్ యూనిట్లు 44,569, వీవీప్యాట్స్- 48,134 అవసరమౌతాయి.

తెలంగాణలో ఉన్న మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 17 కాగా.. ఇందులో జనరల్- 12, ఎస్సీ రిజర్వుడ్-3, ఎస్టీ రిజర్వుడ్-2. అత్యంత తక్కువ విస్తీర్ణం గల లోక్‌సభ నియోజకవర్గం హైదరాబాద్. అతిపెద్ద స్థానం.. ఆదిలాబాద్. ఓట్ల పరంగా చూసుకుంటే అతి తక్కువ ఓటర్లు ఉన్న లోక్‌సభ నియోజకవర్గం- మహబూబాబాద్. ఇక్కడ 14,23,319 మంది ఓటర్లు ఉన్నారు. అతిపెద్ద స్థానం- మల్కాజ్‌గిరి. ఇక్కడ ఏకంగా 31,49,416 మంది ఓటర్లు ఉన్నారు.

2004లో తెలంగాణ వరకు నమోదైన పోలింగ్ శాతం 69.95గా నమోదైంది. 2009లో- 72.70 శాతంగా నమోదైంది. ఆ తరువాత క్రమంగా
పోలింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. 2014లో 68.77, 2019లో 62.72 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+