Lok Sabha exit poll LIVE: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ, ఎవరిది పైచేయి అంటే?
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరింది. ఇక ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ సందడి చేయనున్నాయి. ఆయా సర్వే సంస్థలు, మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలను బయట పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణలో లోక్‌సభ పోరు హోరాహోరీగా జరిగింది. ఇక్కడ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్,బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరిగిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి వారు మెజార్టీ పార్లమెంట్ స్థానాలు తమకంటే తమకే వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరి దృష్టి మళ్లింది. తెలంగాణ పార్లమెంట్ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా ఎవరు ఎన్ని సీట్లు సాధించబోతున్నారనే సర్వే సంస్థల లెక్కలు మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం













Click it and Unblock the Notifications