చాలా గొప్పగా చెప్పారు: కవిత మంచి నాయకురాలన్న సుమిత్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంచి నాయకురాలని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం కొనియాడారు. వివేక వర్ధిని పాఠశాల శతాబ్ది ఉత్సవాలకు సుమిత్రా మహాజన్ హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా సుమిత్ర మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం తాము యూరప్‌కు వెళ్లినప్పుడు కవిత భారతీయ మహిళల గురించి గొప్పగా చెప్పారన్నారు. ప్రతి మహిళకు చదువు చాలా ముఖ్యమని చెప్పారు. నిజాం కాలంలోనే మహిళల విద్య కోసం వివేక వర్ధిని కళాశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

ప్రతి బాలిక చదువుకోవాలని సూచించారు. మహారాష్ట్రీయులు ఎక్కడ ఉన్నా అక్కడి ప్రజలతో త్వరగా కలిసి పోతారన్నారు. కాగా, లోకసభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు కల్వకుంట్ల కవిత బతుకమ్మ చిహ్నాన్ని బహూకరించారు.












Click it and Unblock the Notifications