Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం..!
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతూన్న ద్రోణి బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 24 వరకు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండంగా మారితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో వానలు పడుతున్నాయి. వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రంలో తెలిపాటి నుంచి మోస్తర్ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. వచ్చే వారంలో వర్షాలు లేకుంటే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నైరుతు రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. అండమాన్ లోకి కూడా రుతుపవనాలు వచ్చినట్లు పేర్కొంది.

మే 31న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా దేశంలోకి విస్తరిస్తాయని చెబుతున్నారు. జూన్ 6 తర్వాత తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అవి చురుగ్గా ఉన్నాయని వాతావరణంలో మార్పు వస్తే రుతుపవనాలు కాస్త మెల్లగా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈసారి రుతుపవనాలతో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు. లానినా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.
ఏ పంటలు వేస్తే మంచిదో ప్రణాళికా రూపొందిస్తోంది. అటు రైతులు కూడా దుక్కులు దున్నడానికి సిద్ధమైమయ్యారు పలు చోట్ల విత్తనాలు విత్తడానికి కూడా సిద్ధమైయ్యారు.












Click it and Unblock the Notifications