LPG Crisis:పడిపోతున్న జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు- ప్రమాదంలో డెలివరీబాయ్స్ ఉపాధి..?

పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ గిగ్ కార్మికుల పొట్ట కొడుతున్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన ఎల్‌పీజీ (LPG) సరఫరా అడ్డంకులు ఇప్పుడు మన దేశంలోని ఫుడ్ డెలివరీ రంగాన్ని కుదిపేస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండటంతో జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌లపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది డెలివరీ బాయ్స్ వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై గిగ్ కార్మికుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది.

సగం పడిపోయిన ఆర్డర్లు.. ఆకలితో గిగ్ కార్మికులు

గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) వెల్లడించిన వివరాల ప్రకారం.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్‌లు మరియు వీధి వ్యాపారులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో ఆర్డర్ల సంఖ్య ఏకంగా 50 నుండి 60 శాతం వరకు పడిపోయింది.

lpg-crisis-hits-india-s-gig-workers-zomato-swiggy-delivery-orders-drop-amid-fuel-shortage

"మా సభ్యులు ఆకలితో అలమటిస్తున్నారు" అని యూనియన్ ప్రతినిధి నిర్మల్ గోరానా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రోజుకు 30 డెలివరీలు చేసే కార్మికుడికి ఇప్పుడు 5 నుండి 10 ఆర్డర్లు కూడా రావడం లేదని, దీనివల్ల వేల కుటుంబాలు పూట గడవక ఇబ్బంది పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే కాకుండా, క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు కూడా ఉపాధి కోల్పోతున్నారు.

కోటి మందిపై ప్రభావం.. పెరుగుతున్న నిరుద్యోగ భయం

ఈ ఇంధన సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది కార్మికులు ప్రభావితమవుతారని అంచనా.ముఖ్యంగా పుణె,ముంబై ,ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్థిరమైన వేతనాలు లేదా సామాజిక భద్రత లేని ఈ కార్మికులు,ఇటువంటి అంతర్జాతీయ విపత్తుల వల్ల అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. డెలివరీ ఆర్డర్లు తగ్గడంతో ప్లాట్‌ఫారమ్ కంపెనీలు వారి ఐడీలను (IDs) డియాక్టివేట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

ప్రభుత్వ జోక్యం కోరుతున్న యూనియన్లు
ఈ సంక్షోభం నుండి గిగ్ కార్మికులను గట్టెక్కించడానికి కేంద్ర కార్మిక మంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది. వారు ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లను ఉంచారు:

  • ఫుడ్ బిజినెస్‌లకు అంతరాయం లేని కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాను భరోసా ఇవ్వాలి.
  • ప్రభావితమైన ప్రతి కార్మికుడికి జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు రూ.10,000 తక్షణ ఆర్థిక సాయం అందించాలి.
  • వచ్చే మూడు నెలల వరకు డెలివరీ పార్ట్నర్ల ఐడీలను డియాక్టివేట్ చేయకూడదు.
  • సామాజిక భద్రతా కోడ్ (Code on Social Security, 2020) కింద గిగ్ కార్మికులకు పూర్తి రక్షణ కల్పించాలి.
  • LPG Crisis Hits India s Gig Workers Zomato Swiggy Delivery Orders Drop Amid Fuel Shortage

రవాణా రంగానికీ సెగ..ఓలా,ఉబెర్ డ్రైవర్ల ఆందోళన
మరోవైపు ఎల్‌పీజీ, సీఎన్‌జీ (CNG) వాహనాలు నడిపే ఓలా, ఉబెర్ మరియు రాపిడో డ్రైవర్లపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలంగాణ గిగ్ వర్కర్ల యూనియన్ హెచ్చరించింది. ఇంధన కొరత ఏర్పడితే గంటల తరబడి బంకుల వద్ద క్యూలో ఉండాల్సి వస్తుందని, ఇది నేరుగా వారి దైనందిన ఆదాయాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరుగుతున్న యుద్ధం.. ఇక్కడ సామాన్య డెలివరీ బాయ్ కడుపు కొట్టడం గ్లోబల్ ఎకానమీలోని విషాదానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం మరియు టెక్ ప్లాట్‌ఫారమ్ సంస్థలు సమన్వయంతో స్పందించి, ఈ అసంఘటిత రంగ కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ఈ 'గిగ్ ఎకానమీ' సంక్షోభం ఒక పెను విపత్తుగా మారే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+