"మా" పోలింగ్ ఫుటేజ్ కావాలి - మోహన్ బాబు..నరేశ్ దాడులు చేసారు : ఎన్నికల అధికారికి ప్రశాశ్ రాజ్ లేఖ..!!

"మా" పోలింగ్ నాటి వ్యవహారం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ఎన్నికలు పూర్తయి విష్ణు గెలిచిన తరువాత వరుస రాజీనామాలతో ట్విస్ట్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్..ఇప్పుడు మరో అడుగు వేసారు. పోలింగ్ రోజున రికార్డు అయిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని కోరుతూ ఎన్నికల అధికారి క్రిష్ణ మోహన్ కి లేఖ రాసారు. పోలింగ్ రోజు ఉదయం 8 గంటల నుంచి అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు మొత్తం సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయని.. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసుకోవాలని ఉందని లేఖలో పేర్కొన్నారు.

పోలింగ్ సమయంలో ఫుటేజ్ ఇవ్వండి

పోలింగ్ సమయంలో ఫుటేజ్ ఇవ్వండి

ఎన్నికలు జరిగిన తీరును సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పారదర్శకంగా ఉండాలని..ఆ రోజు సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లుగా మీరు చెప్పారంటూ ఎన్నికల అధికారికి రాసిన లేఖలో ప్రకాశ్ రాజ్ ప్రస్తావించారు. ఆ రోజు తమ ప్యానల్ సభ్యుల పైన మోహన్ బాబు..నరేశ్ దాడులు చేసారని లేఖలో వివరించారు. ఇదే విషయాన్ని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలోనూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు తమ ప్యానల్ కు చెందిన తనీశ్.. బెనర్జీని కొట్టారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.

మోహన్ బాబు - నరేశ్ దాడులు చేసారు

మోహన్ బాబు - నరేశ్ దాడులు చేసారు

ఇక, బెనర్జీ సైతం తనను మోహన్ బాబు బూతులు తిట్టారని..కొట్టటానికి వచ్చారంటూ బోరున విలపించారు. దీంత..మోహన్ బాబు సతీమణి తనకు కాల్ చేసి ఓదార్చారని చెప్పుకొచ్చారు. ఆ రోజున విష్ణు - మనోజ్ లేకపోతే ఇంకా పెద్ద గొడవలు అయ్యేవని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక, సాధ్యమైనంత త్వరగా తమకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ లేఖలో కోరారు. ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మోహన్ బాబు.. నరేశ్ ఆ రోజు వ్యవహరించిన తీరు సీసీ కెమేరాల్లో రికార్డు అయి ఉందని లేఖలో పేర్కొన్నారు.

ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలియాలి

ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలియాలి

తమ సభ్యుల పైన భౌతిక దాడులు జరిగాయని ఎన్నికల అధికారికి రాసిన లేఖలో వివరించారు. మొత్తం సీసీ కెమేరాలు అమర్చినట్లుగా ఎన్నికల అధికారి చెప్పినట్లుగా లేఖలో స్పష్టం చేసారు. సీసీ ఫుటేజ్ బయట పెడితే అసలు విషయాలు తెలుస్తాయని ప్రకాశ్ రాజ్ అభిప్రాయ పడ్డారు. ఇక, ఆ రాత్రి పోలింగ్ ముగిసిన తరువాత ఫలితాలు ఈసీ సభ్యులవి వెల్లడించకుండానే ఎన్నికల అధికారి బ్యాలెట్ పత్రాలను తీసుకెళ్లారంటూ కొందరు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు.

Recommended Video

    Exclusive Interview with Bigg Boss 5 Contestant Hamida || Oneindia Telugu
    ఎన్నికల అధికారి నిర్ణయం కీలకంగా

    ఎన్నికల అధికారి నిర్ణయం కీలకంగా

    అయితే, తాను బ్యాలెట్ పత్రాలు తీసుకెళ్లలేదని ఎన్నికల అధికారి క్రిష్ణ మోహన్ స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ సీసీ టీవీ ఫుటేజ్ అడగటంతో..దీని పైన ఎన్నికల అధికారి ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. సీసీ ఫుటేజ్ బయటకు వస్తే.."మా" వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసారు. వారి విసక్ష్ం పైన ఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని విష్ణు స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజ్ విషయంలో ఎన్నికల అధికారి నిర్ణయం కీలకం కానుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+