Telangana: విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్ గా మదన్ భీంరావు లోకూర్..
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్ గా జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ నియమించింది. గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి, అక్రమ ఒప్పందాలపై విచారణ చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ విచారణ కమిషన్ ను నియమించింది. ఈ విద్యుత్ విచారణ కమిషన్ కు ఛైర్మన్ గా జస్టిస్ నర్సింహా రెడ్డి ఉన్నారు. అయితే అయన మాజీ సీఎం కేసీఆర్ ను విచారణ పిలిచారు. అయితే కేసీఆర్ విచారణకు వెళ్లలేదు.
కేసీఆర్ సుప్రీం కోర్టు వెళ్లారు. కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్‌శంకర్ నారాయణన్ వాదించారు. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ తరుఫు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షల వాదన విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం నరసింహా రెడ్డి తప్పించాలని స్పష్టం చేసింది.

అయితే విద్యుత్ కమిషన్ విచారణ చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. దీంతో జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ ఛైర్మన్ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఖాలీగా ఉన్న విద్యుత్ విచారణ కమిషన్ కు ఛైర్మన్ ను నియమించారు. ఇందుకు సంబంధించి జులై 30వ తేదీన విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదన్ బీ లోకూర్ ఉమ్మడి ఏపీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
ఆయన 1977లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. డిగ్రీ పొందారు. ఆయన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదిగా విధులు నిర్వహించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, రెవెన్యూ, సేవల చట్టాల్లో ఆయనకు చాలా అనుభవం ఉంది. లోకూరు అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా పని చేశారు. 1999 జులై 5న ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications